తెలంగాణ

మహా బతుకమ్మకు భారీ ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 19: ఈ నెల 26న జరిగే మహా బతుకమ్మ నిర్వహణకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్ ఆదేశించారు. మహా బతుకమ్మ కార్యక్రమంలో పాల్గొనడానికి జిల్లాల నుంచి దాదాపు 40 వేల మహిళలు వస్తారని అంచన వేస్తున్నట్టు సిఎస్ అన్నారు. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సిఎస్ ఆదేశించారు. సచివాలయంలో మంగళవారం సం బంధిత శాఖల అధికారులతో మహా బతుకమ్మ ఏర్పాట్లపై నగర పోలీస్ కమిషనర్, హెచ్‌ఎండిఎ కమిషనర్, పర్యాటకశాఖ మేనేజింగ్ డైరెక్టర్, సాంస్కృతికశాఖ డైరెక్టర్ తదితరులతో సిఎస్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ, ట్రాఫిక్ బందోబస్తు, మొబైల్ టాయిలెట్స్, బారీకేడింగ్, సైన్ బోర్డులు, మంచినీటి సదుపాయం, నిరంతర విద్యుత్, ఎల్‌ఇడి స్క్రీన్స్, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఏర్పాట్లన్ని సక్రమంగా ఉండాలన్నారు. హైదరాబాద్ లో ట్రాఫిక్ జంక్షన్లు, ముఖ్యమైన ప్రాం తాలు, చారిత్రక, వారసత్వ కట్టడాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలని ఆదేశించారు.
మహా బతుకమ్మను విజయవంతం చేసేందుకు ఫేస్ బుక్, ట్విట్టర్, యూ ట్యూబ్, హోర్గింగ్‌లు, బస్ షెల్టర్ల ద్వారా విస్తృత ప్రచారం చేయాలన్నారు. 28న సద్దుల బతుకమ్మ సందర్భంగా మహిళలు లుంబినీ పార్క్ నుంచి ట్యాంక్ బండ్‌పైకి ర్యాలీగా వెళ్లి నిమజ్జనం చేస్తారన్నారు.