తెలంగాణ

మూడేళ్ల ప్రోగ్రెస్ రిపోర్టు ఏది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 21: రాష్ట్రప్రభుత్వం గత మూడేళ్లలో ఏం సాధించిందో ప్రజలకు ప్రోగ్రెస్ రిపోర్టు ఇవ్వాలని బిజెపి గురువారం నాడు డిమాండ్ చేసింది. శాసనమండలి బిజెపి పక్ష నేత ఎన్ రామచందర్‌రావు పాత్రికేయులతో మాట్లాడుతూ కాళేశ్వరం ఘటనపై విచారణ జరిపించాలని, అలాగే నాసిరకం చీరల కుంభకోణంపై న్యాయవిచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ముస్లిం బాలికలను విదేశీ షేక్‌లకు ఇచ్చి వివాహాలు చేయిస్తున్న ఘటనపైనా సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. చీరల లబ్ధిదారుల జాబితాలను కూడా బయటపెట్టాలని, చీరల , సబ్సిడీల లోగుట్టును వెల్లడించాలని అన్నారు. మూడేళ్లలో డబుల్‌బెడ్‌రూం ఇళ్లు ఎన్నికట్టారో చెప్పాలని, మూడు ఎకరాలు చొప్పున ఇస్తామన్న భూములు ఎంత మంది దళితులకు ఇచ్చారో చెప్పాలని, లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న ప్రభుత్వం ఎన్ని పోస్టులు భర్తీ చేసిందో చెప్పాలని ఆయన నిలదీశారు. మూడేళ్ల రిపోర్టు ఇస్తే నిజాలు తెలుస్తాయని అన్నారు. కేవలం మాటల గారడీతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారని అన్నారు. విద్యార్ధులపై కేసులు పెడుతున్నారని, ప్రశ్నించిన రైతులపైనా కేసులు పెడుతున్నారని, ఈ ప్రభుత్వంపై అందరికీ తీవ్ర అసంతృప్తి ఉందని అన్నారు. 2019లో బిజెపి తన సత్తా చాటుకుంటుందని అన్నారు. టిఆర్‌ఎస్ నేతలు వాడే పదాలను తాము వాడబోమని, ప్రజలు మాత్రం అంతా గమనిస్తున్నారని అన్నారు.
బిజెపి ఏ కార్యక్రమం చేసినా ప్రభుత్వానికి భయం పట్టుకుందని, రానున్న రోజుల్లో ఎన్నికల్లో ముప్పు ఉంటుందని టిఆర్‌ఎస్ భయపడుతోందని పేర్కొన్నారు. రాం మాధవ్ రాకను టిఆర్‌ఎస్ జీర్ణించుకోలేకపోతున్నారని, ఎంతో అసహనంగా మాట్లాడుతున్నారని చెప్పారు. రాం మాధవ్ మాట్లాడిన ప్రతి విషయానికి తాము కట్టుబడి ఉన్నామని, రాజకీయంగా తీసుకుని దానిని చర్చించాలే తప్ప ఏ నాయకుడు రాష్ట్రానికి రాకూడదనే విధానం సరికాదని అన్నారు. ప్రభుత్వం చేసే తప్పిదాలను బయటపెట్టే ప్రయత్నం చేసినా, ఖండించే ప్రయత్నం చేసినా, ప్రమాద ఘటన జరిగే ప్రదేశానికి వెళ్లినా ప్రభుత్వం అడ్డుకోవడం దారుణమని అన్నారు. ప్రభుత్వం తీరు చూస్తుంటే ఎంత ప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందో అర్ధం అవుతోందని ఎద్దేవా చేశారు. ఇతర రాష్ట్రాల నుండి నాయకులు వచ్చినపుడు ఆంధ్రా నాయకుడికి ఇక్కడేం పని అంటూ టిఆర్‌ఎస్ నేతలు మాట్లాడతారని ఇదేం పద్ధతి అని రాంచందర్‌రావు ప్రశ్నించారు. బిజెపి జాతీయ పార్టీ అనేది మరిచిపోతున్నారని అన్నారు.

చిత్రం..పార్టీ కార్యాలయంలో గురువారం విలేఖరులతో మాట్లాడుతున్న
శాసనమండలి బిజెపి పక్ష నేత రామచందర్‌రావు