తెలంగాణ

మూడు మార్కెట్ కమిటీల ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 21: నిర్మల్ మార్కెట్ కమిటీ పరిధిలోని లక్ష్మణ్‌చందా మార్కెట్‌ను సబ్-మార్కెట్ యార్డుగా గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రైతులు తీసుకువచ్చే ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు వీలుగా లక్ష్మణ్‌చందా మార్కెట్‌ను సబ్-మార్కెట్ యార్డుగా గుర్తించారు. ప్రస్తుతం ఇది నిర్మల్ మార్కెట్ కమిటీ పరిధిలో ఉంది. జనగాం జిల్లాలోని కొడకండ్ల మార్కెట్ కమిటీ పరిధిలో ఉన్న పాలకుర్తి మార్కెట్ యార్డును ప్రత్యేక వ్యవసాయ మార్కెట్ కమిటీగా ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు జీఓ జారీ అయింది. అలాగే సిద్ధిపేట జిల్లాలోని వంటిమామిడి వ్యవసాయ మార్కెట్‌పరిధిలోన్న తూప్రాన్, మనోహరాబాద్ మార్కెట్ యార్డులను ప్రత్యేక మార్కెట్ కమిటీలుగా ప్రకటించారు.