తెలంగాణ

డిజిపి ఆఫీసులో బతుకమ్మ వేడుక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 21: డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ప్రధాన కార్యాలయం ఆవరణలో గురువారం సురక్ష బతుకమ్మ వేడుకను తెలంగాణ డిజిపి అనురాగ్ శర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ సంస్కృతి, బతుకమ్మ పాటలను రూపొందించిన సురక్ష బతుకమ్మ పాటల ఆడియో,సిడీని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిజిపి అనురాగ్ శర్మ మాట్లాడుతూ, బతుకమ్మ పండుగ జరుపుకుంటున్న తెలంగాణ ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ పరంగా బతుకమ్మ పండుగ జరుపుకోవడం, ప్రోత్సహించడం ముదావహమన్నారు. ఈ కార్యక్రమంలో హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజీవ్ త్రివేది, నగర కమిషనర్ మహేందర్‌రెడ్డి, జైళ్లశాఖ డిజి వికె సింగ్‌లతోపాటు జాగృతి సభ్యులు, మహిళలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
రైల్వేశాఖ ఆధ్వర్యంలో..
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని రైల్వే స్టేషన్లలో బతుకమ్మ లేజర్ షోను ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ రోడ్ సేఫ్టీ, రైల్వే డిజిపి కృష్ణప్రసాద్ మాట్లాడుతూ, తొమ్మిది రోజుల పాటు జరుపుకోనున్న బతుకమ్మ ఎంగిలి పూలతో ప్రారంభమైందన్నారు. శాంతి సౌభాగ్యాలతో ప్రేమానురాగాలు పంచుకుని బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములవ్వాలని అన్నారు. ఈ బతుకమ్మ పండుగను ప్రధాన రోడ్ల కూడళ్లలో, దేశం నలుమూలల నుంచి వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు వచ్చి..పోయే..సికిందరాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్లలో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు.
‘బతుకమ్మ’లో మంత్రుల బిజీ బిజీ
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్మాత్మకంగా చేపట్టిన బతుకమ్మ పండుగలో రాష్ట్ర మంత్రులు బిజీగా ఉన్నారు. మంత్రులు జిల్లాలకు వెళ్లిపోవడంతో రాష్ట్ర సచివాలయం బోసిపోయింది. తొమ్మిదిరోజుల పాటు మంత్రులు తమ తమ సొంత జిల్లాల్లో పర్యటించాలని ప్రభుత్వం సూచించడంతో మంత్రులు సొంత జిల్లాలకు వెళ్లిపోయారు. గత మూడు రోజుల నుండి బతుకమ్మ చీరల పంపిణీలో వీరంతా నిమగ్నమయ్యారు. ఆ యా ప్రాంతాల్లో పార్లమెంట్‌సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు బతుకమ్మ కార్యక్రమాల్లో భాగస్వాములవుతున్నారు. ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరిస్తున్నారు.

చిత్రం..సురక్ష బతుకమ్మ పాటల సిడీని ఆవిష్కరిస్తున్న డిజిపి