తెలంగాణ

కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.11,400 కోట్ల రుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 22: కాళేశ్వరం ప్రాజెక్టు రెండవ దశకు రూ. 11,400 కోట్ల రుణం ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు వచ్చాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్ తెలిపారు. తాజ్‌కృష్ణ హోటల్లో శుక్రవారం కాళేశ్వరం ప్రాజెక్టు-2-ఆర్థిక ముగింపు’ సమావేశం జరిగింది. నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో బ్యాంకులు భాగస్వామ్యం కావటం వల్ల ప్రభుత్వానికి మరికొన్ని కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి దోహదం చేస్తుందని సిఎస్ అన్నారు. కొన్ని ప్రాజెక్టులు నిధుల కొరతను ఎదుర్కొంటున్నాయన్నారు.
ఈ దశలో బ్యాంకులు ముందుకు రావడం వల్ల ప్రాజెక్టులు నిర్ణీత గడువులో పూర్తి అవుతాయన్నారు. అభివృద్ధి కార్యక్రమాల పట్ల బ్యాంకుల దృక్ఫథం మారడం శుభప్రదమన్నారు. కేవలం రెండు నెలల స్వల్పకాలంలో రూ.11,400 కోట్ల నిధులు సమకూర్చడం ఒక రికార్డు అన్నారు. రూ.12,500 కోట్ల రుణం ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు వచ్చినప్పటికీ ప్రాజెక్టు వ్యయాన్ని 33 శాతం రూ.11,400 కోట్ల రుణానికి కుదించినట్టు సిఎస్ వివరించారు. రెండవ దశ నిర్మాణానికి రూ.34,440 కోట్లు అవసరం అవుతుందన్నారు. అలాగే ప్యాకేజి 1 మరియు 2కు రూ.4000 కోట్లు అవసరం అవుతుందని, దీనిని కూడా ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు రావాలని అన్నారు. బ్యాంకులు త్వరగా రుణాల మొత్తాన్ని విడుదల చేస్తే ప్రాజెక్టుల పనులు గడువులోగా పూర్తి అవుతాయన్నారు.

చిత్రం..శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన కాళేశ్వరం ప్రాజెక్టు-2-ఆర్థిక
ముగింపు సమావేశంలో సిఎస్ ఎస్‌పి సింగ్, బ్యాంకర్లు