తెలంగాణ

బిల్లుపై మహిళా సోనియాకు మద్దతు ఇవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 23: లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదం కోరుతూ డిమాండ్ చేస్తున్న ఎఐసిసి అధినేత్రి సోనియా గాంధీకి టిఆర్‌ఎస్ మద్దతు ఇవ్వాలని టిపిసిసి అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ మహిళా సాధికారితకు మొగ్గుచూపుతోందని, ఇందుకోసమే మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తీసుకురావాలని ఒత్తిడి తెస్తోందని అన్నారు. శనివారం నాడిక్కడ గాంధీభవన్‌లో నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాల్లో ఉత్తమ్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరెళ్ల శారద, మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, ఇతర సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాజకీయ ప్రాతినిధ్యం ద్వారానే మహిళా సాధికారిత పూర్తిగా ఏర్పడుతుందన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నమ్ముతోందని అన్నారు. ఇదే ఆలోచనతోనే రాజీవ్‌గాంధీ గతంలో మహిళలకు రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వాలని సంకల్పించి పంచాయతీరాజ్ చట్టానికి సవరణ చేసి 33 శాతం స్ధానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించిన ఘనత తమదేనని అన్నారు. తద్వారానే గ్రామ, మండల స్థాయిలో మహిళా ప్రాతినిధ్యం పెరిగి కొత్త రాజకీయ ఒరవడిని సృష్టించినట్లు అయ్యిందని అన్నారు. 2010 నుంచి లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు పెండింగ్‌లో ఉండిపోయిందని, కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ బిల్లు ఆమోదింప చేసుకునేందుకు కృతనిశ్చయంతో ఉందని అన్నారు. దేశంలో ప్రముఖ రాష్టమ్రైన తెలంగాణ మంత్రి వర్గంలో ఒక్క మహిళా మంత్రి లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. మహిళా మంత్రిని నియమించకపోవడం వెనుక ఉద్దేశ్యం మహిళలు మంత్రిగా బాధ్యతలు నిర్వహించలేరనే అపవాదును కెసిఆర్ అంటకట్టారని అన్నారు. మహిళా సాధికారితకు తెలంగాణ ప్రభుత్వం ఏమాత్రం సహకరించడం లేదని తెలిపారు. ఇప్పటికైనా సిఎం కెసిఆర్ ముందుకు వచ్చి ప్రధాని మోదీపై ఒత్తిడి తెచ్చేందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ లోక్‌సభలో చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలని అన్నారు. తెలంగాణ మహిళా కాంగ్రెస్ విభాగం రిజర్వేన్ బిల్లు ఆమోదం కోరుతూ 3 లక్షల సంతకాల సేకరణ చేసి పంపడం పట్ల మహిళా కాంగ్రెస్ విభాగాన్ని ఉత్తమ్ అభినందించారు.