తెలంగాణ

జూరాలకు వరద ఉద్ధృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, సెప్టెంబర్ 23: ఎగువ ప్రాంతంలోని మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అక్కడి ఆల్మటి, నారాయణపూర్ జలాశయాలు వరద నీటితో పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకున్నాయి. అక్కడి నుండి పెద్ద ఎత్తున నీటిని దిగువకు విడుదల చేస్తుండడంతో కృష్ణానది గుండా జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరుగుతోంది. గత పదిహేను రోజులుగా జూరాలకు వస్తున్న వరదకు తోడుగా ఆదివారం మరింత పెరగడంతో జూరాల ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. జూరాల ప్రాజెక్టు 318.270 మీటర్ల స్థాయిలో నీటి నిల్వ ఉంది.
ఎగువ ప్రాంతం నుండి 1,70,000 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టుకు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు 18 గేట్లను ఎత్తి దిగువకు 1,69,567 క్యూసెక్కులను వదులుతున్నారు. జూరాలకు వస్తున్న వరద నీటిని వినియోగించుకొని జలవిద్యుత్కేంద్రంలో 6 యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేపడుతున్నారు. నెట్టెంపాడు, బీమా, కోయిల్‌సాగర్, సమాంతర కాలువలకు కూడా సాగునీటిని విడుదల చేస్తున్నారు. ఆల్మట్టి జలాశయంలో 126.56 టిఎంసిల నీరు నిల్వ ఉండగా, ఎగువ ప్రాంతం నుండి 1,21,316 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్టు నుండి దిగువకు 1,33,492 క్యూసెక్కులను వదులుతున్నారు. నారాయణపురం జలాశయంలో 34.99 టిఎంసిల నీరు నిల్వ ఉండగా, ఎగువ ప్రాంతం నుండి 1,32,594 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా, దిగువకు 1,24,396 క్యూసెక్కులను వదులుతున్నారు.