తెలంగాణ

టిఆర్‌ఎస్‌ను నమ్మొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 24: సింగరేణి కార్మికులెవరూ టిఆర్‌ఎస్‌ను నమ్మొద్దని, ఆ పార్టీ సంస్థను అమ్మేస్తుందని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. ఇతర పార్టీల ప్రజాప్రతినిధులను ప్రలోభపెట్టినట్లుగానే ఇప్పుడు సింగరేణి కార్మికుల తలలకు వెలకడుతున్నారని విమర్శించారు. ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. గుర్తిం పు ఎన్నికల్లో గెలిచిన తర్వాత మూడేళ్లలో వారసత్వ ఉద్యోగాల ఊసెత్తని టిఆర్‌ఎస్, మళ్లీ ఇప్పుడు దగాకోరు హామీలతో ముందుకు వస్తోందని అన్నారు. 2014లో సిఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వారసత్వ ఉద్యోగాల ఫైల్‌పై సిఎం కెసిఆర్ ఎందుకు సంతకం చేయలేదో సమాధానం చెప్పాలని అన్నారు. సింగరేణి కార్మికులకు హక్కులు, ఉద్యోగ భద్రత కల్పించిన ఘనత ముమ్మాటికీ ఎఐటియుసిదేనని అన్నారు. వాటి పరిరక్షణ కోసం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్‌ను గెలిపించాలని, టివిజికెఎస్‌ను ఓడించాలని కార్మికులకు పిలుపునిచ్చారు.