తెలంగాణ

తరలొచ్చిన కృష్ణమ్మ.. తప్పిన తాగునీటి కష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, సెప్టెంబర్ 24: కృష్ణానదికి ఈ దఫా వర్షాకాలంలో ఆశించిన వరదలు కరవైపోవడంతో కనీస నీటి మట్టం 510టిఎంసిల దిగువకు 499అడుగులకు పడిపోయిన నాగార్జున సాగర్ ప్రాజెక్టు జలాశయం నీటి మట్టం శ్రీశైలం ప్రాజెక్టు జల విద్యుత్ కేంద్రాల నుండి తాజాగా విడుదలవుతున్న నీటితో తిరిగి కనీస నీటి మట్టానికి చేరింది. కృష్ణాబోర్డు ఆదేశాల మేరకు తెలంగాణకు 9టిఎంసిలు, ఆంధ్రకు 16టిఎంసిలు శ్రీశైలం నుండి సాగర్‌కు వెంటనే నీటి విడుదల చేయాల్సివుంది. అంతకుముందే ఏపి పొతిరెడ్డిపాడు ద్వారా, తెలంగాణ శ్రీశైలం జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా నీటి విడుదల ఆరంభించిన క్రమంలో నాగార్జున సాగర్‌కు శ్రీశైలం జల విద్యుత్ కేంద్రాల నుండి చేరిన నీరు ఇప్పటికే 511అడుగులకు చేరింది. సాగర్ నుండి ఆంధ్రకు ఇవ్వాల్సిన 16టిఎంసిల నీటి విడుదలలో భాగంగా కుడి కాల్వ ద్వారా హెచ్చుతగ్గులుగా 2,236క్యూసెక్కుల నీటి విడదల కొనసాగుతోంది. ఏఎమ్మార్పీకి 1200క్యూసెక్కులు సరఫరా చేస్తున్నారు. శ్రీశైలం నుండి 42,378క్యూసెక్కుల ఇన్‌ఫ్లో సాగర్‌కు వస్తుంది. శ్రీశైలానికి లక్షా 77,985క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఎగువ నుండి వస్తుంది. అయితే బోర్డు ఆదేశాల మేరకు తెలంగాణకు కేటాయించిన 9టిఎంసిలలో రెండు టిఎంసిలను శ్రీశైలం నుండి వచ్చే నెలలో తీసుకోవాల్సివుంది. సాగర్ జలాశయం నీటి మట్టం ఈ ఏడాది కృష్ణా బేసిన్‌లో వరద నీటికొరతతో 499.50అడుగులకు పడిపోవడంతో ఆయకట్టులో ఖరీఫ్ సాగుకు సాగలేదు. హైద్రాబాద్-నల్లగొండలకు తాగునీటి కష్టాలు ఎదురయ్యాయి.
రబీ పంటపై ఆయకట్టు రైతుల్లో ఆశలు
నాగార్జున సాగర్‌లో నీటి మట్టం మళ్లీ కనిష్ట స్థాయి 510అడుగులకు ఎగువకు 511అడుగులకు పైగా చేరుకోవడంతో హైద్రాబాద్, నల్లగొండలకు పుట్టంగండి ఏఎమ్మార్పీ ఎత్తిపోతల ప్రాజెక్టు వద్ద ఎమర్జన్సీ మోటార్ల నిర్వహణ అవసరం లేకుండా పోయింది. దీంతో సాగర్ జలాశయంలో పుట్టంగండి జీరో పాయింట్ వద్ద జలాశయంలోని అప్రోచ్ కెనాల్‌కు ఏర్పాటు చేసిన ఎమర్జన్సీ మోటార్లను తొలగించి తరలిస్తున్నారు. ఈ ఏడాది సాగర్ జలాశయంలో నీటి నిల్వ ముందెన్నడూ లేని రీతిలో 499.50అడుగులకు పడిపోవడంతో పుట్టంగండి రెండు ప్రధాన మోటార్లకు నీరందించేందుకు పది ఎమర్జన్సీ మోటార్లను ఏర్పాటు చేయడంతో పాటు వాటికి నీరందించేందుకు జలాశయంలో అప్రోచ్ కెనాల్‌ను పొడిగించడం, నీటిలోపల డ్రెడ్జింగ్ చేసి ఎమర్జన్సీ మోటార్లకు నీరందించే చర్యలు చేపట్టారు. ఇందుకోసం ఇప్పటికే 4కోట్లు వెచ్చించారు. మోటార్ల నిర్వాహణకు నెలకు కోటి రూపాయల విద్యుత్ భారం పడుతుండేది. అలాగే సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు సాగర్‌కు ఎగువ నుండి వరదలు రాని పక్షంలో సాగర్ జలాశయంలో 495అడుగుల వర కు నీరు తీసుకునేలా మరో 4కోట్లు పెట్టి అదనంగా మరింత లోతుకు డ్రెడ్జింగ్ చేయాలని నిర్ణయించారు. అయితే సాగర్ జలాశయానికి జూరాల, శ్రీశైలంల నుండి నీటి విడుదల జరుగడం సాగర్‌లో మళ్లీ కనిష్ట నీటి మట్టం పెరుగడంతో ఎమర్జన్సీ మోటార్ల ఖర్చు, అదనపు డ్రెడ్జింగ్ ఖర్చులు తప్పినట్టయ్యింది. అలాగే జంటనగరాలకు, నల్లగొండ జిల్లా ప్రజలకు తాగునీటి కష్టాలు దూరమయ్యాయి. అటు సాగర్‌లో నిన్నటిదాకా కనీస నీటి మట్టం కూడా లేకపోవడం తో ఎడమ కాల్వ కింద రైతు లు ఖరీఫ్ పంట సాగుకు దూరమయ్యారు. ప్రస్తుతం సాగర్‌లో నీటి మట్టం పెరిగినందున రబీ సీజన్ పంటల సాగుకు వారబందీగా తాగునీటి అవసరాల పేరుతో ముందస్తుగా నీటి విడుదలకు అవకాశం నెలకొనడం ఆయకట్టు రైతాంగంలో ఆశలు రేపుతోంది. అదే జరిగితే ఎడమకాలువ కింద మూడున్న ర లక్షల ఎకరాల మేరకు రబీ పంటకు అవకాశముంది.

చిత్రం..నీటి మట్టం పెరగడంతో ఏఎమ్మార్పీ పుట్టంగండి ఎమర్జెన్సీ మోటార్లను తొలగిస్తున్న దృశ్యం