తెలంగాణ

నిధుల వరద!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, సెప్టెంబర్ 27: కాళేశ్వరం ప్రాజెక్టు రెండో దశ నిర్మాణ పనులకు ప్రముఖ బ్యాంకులు రుణాలతో ముందుకొచ్చాయి. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్‌కు పంజాబ్ నేషనల్ బ్యాంక్ సారథ్యంలోని బ్యాంకర్ల కన్సార్టియం రూ.11,400 కోట్లు రుణాన్ని మంజూరు చేశాయి. సచివాలయంలో బుధవారం రుణ ఒప్పందంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్ సమక్షంలో ఇరిగేషన్‌శాఖ, ఆర్థికశాఖ, బ్యాంక్ అధికారులు రుణ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
కాళేశ్వరం రెండో దశ పనుల కోసం ఇవ్వబోయే రూ.11,400 కోట్ల రుణంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ.1900 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.1500 కోట్లు, కెనరా బ్యాంక్ రూ.1500 కోట్లు, అలహాబాద్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, పంజాబ్ సింధు బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ రూ.1000 కోట్ల చొప్పున రుణం ఇవ్వనున్నాయి. అలాగే ఇండియన్ బ్యాంక్ రూ.750 కోట్లు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర రూ.500 కోట్ల చొప్పున, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.250 కోట్లు రుణంగా ఇవ్వడానికి
ఒప్పందం చేసుకున్నాయి. భారీ నీటిపారుదల ప్రాజెక్టుకు బ్యాంకులు అతి తక్కువ వ్యవధిలో నెల రోజుల్లోనే రుణం అందించి రికార్డు సృష్టించాయని ఈ సందర్భంగా సిఎస్ ఎస్‌పి సింగ్ అభినందించారు. రాష్ట్ర అభివృద్ధిలో బ్యాంకులు పాలుపంచుకోవడం ఆనందకరమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు రెండో దశ నిర్మాణానికి రూ.34,440 కోట్ల వ్యయం కానుండగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ సారథ్యంలోని బ్యాంకుల కన్సార్టియం రూ.11,400 కోట్ల రుణం ఇవ్వడానికి అంగీకరించాయని సిఎస్ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు రుణం ఇవ్వడం వల్ల రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, ముఖ్యంగా రైతాంగానికి ఎంతో మేలు చేయనుందని సిఎస్ అన్నారు.

బ్యాంకుల వారీ..
పంజాబ్ నేషనల్ బ్యాంకు రూ. 1900 కోట్లు
బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.1500 కోట్లు
కెనరా బ్యాంక్ రూ.1500 కోట్లు
అలహాబాద్ బ్యాంక్ రూ.1000 కోట్లు
సిండికేటు బ్యాంక్ రూ.1000 కోట్లు
పంజాబ్ సింధ్ బ్యాంక్ రూ.1000 కోట్లు
ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్
కామర్స్ రూ.1000 కోట్లు
ఇతర బ్యాంక్‌లు రూ.2750 కోట్లు