తెలంగాణ

ఐఎన్‌టియుసిదే విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 28: సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్‌టియుసి గెలుస్తుందని శాసనమండలిలోని ప్రతిపక్ష నేత మహ్మద్ అలీ షబ్బీర్ ధీమా వ్యక్తం చేశారు. కార్మికులంతా ఐఎన్‌టియుసి వైపే ఉన్నారని అన్నారు. గురువారం ఆయన బెల్లంపల్లి, గోదావరి ఖని ప్రాంతాల్లోని పలు ప్రాంతాల్లో సింగరేణి గనుల వద్ద కార్మికులను కలిసి వారితో సింగరేణి ఎన్నికల గురించి చర్చించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో తీసుకున్న చర్యల వల్ల సింగరేణి సంస్థ లాభాల బాట పట్టిందని, ఆనాడు తీసుకున్న నిర్ణయాల వల్లే సింగరేణి సంస్థ అభివృద్ధి దిశగా పని చేస్తోందని అన్నారు.
కార్మికుల సంక్షేమన్ని దృష్టిలో ఉంచుకుని పనిచేసే ఆనాటి స్వర్ణయుగాన్ని తిరిగి తెచ్చుకునేందుకు ఐఎన్‌టియుసిని గెలిపించాలని షబ్బీర్ అభ్యర్ధించారు. సింగరేణి ఎన్నికల్లో టిఆర్‌ఎస్ అనుబంధ కార్మిక సంఘం ద్వారా టిఆర్‌ఎస్ లబ్దిపొందాలని చూస్తోంది తప్ప, గతంలో కార్మికులకు ఇచ్చిన హామీలను ఏమాత్రం అమలు చేయలేదని అన్నారు. కేంద్రంలోని ఎన్‌డిఏ ప్రభుత్వంతో సిఎం కెసిఆర్ కుమ్మక్కై సింగరేణిని ప్రైవేటు పరం చేసి తమకు అనుకూలమైన వారికి కట్టబెట్టాలని ప్రయత్నం చేస్తున్నారని షబ్బీర్ ఆరోపించారు. సిఎం కెసిఆర్, ఆయన కుమార్తె నిజామాబాద్ ఎంపి కె.కవిత సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీని ఏమాత్రం నిలబెట్టుకోకపోవడం వల్ల టిఆర్‌ఎస్ పట్ల కార్మికులు చాలా అసంతృప్తిగా ఉన్నారని అన్నారు. రానున్న సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో టిఆర్‌ఎస్ అనుబంధ కార్మిక సంఘానికి తగిన బుద్ధి చెబుతారని అన్నారు. సింగరేణి అభివృద్ధికి తగిన అభ్యర్థులను కార్మిక నేతలుగా ఎన్నుకోవాలని ఆయన కోరారు.