తెలంగాణ

టెన్నిస్‌లో రాణిస్తున్న పోలీస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 28: పోలీసులు అంటే..శాంతిభద్రతలు కాపాడడమే కాదు..క్రీడల్లోనూ రాణిస్తారని ఓ పోలీస్ అధికారి నిరూపించారు. తనకు ఇష్టమైన టెన్నిస్ క్రీడలో సూపర్‌హిట్ అవుతూ, యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. పతకాలు సాధించిన పోలీస్ అధికారి నల్లమోతు బోస్‌కిరణ్, హైదరాబాద్ నగరంలోని డబీర్‌పురా పోలీస్ స్టేషన్‌లో అదనపు ఇన్స్‌పెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఉద్యోగంలో బిజీగా ఉన్నా..ఆటల్లోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. పోలీస్ టోర్నమెంట్‌లో పతకాలు సాధిస్తున్నారు. 12ఏళ్ల వయసులోనే బోస్ కిరణ్ టెన్నిస్ బ్యాట్ పట్టారు. పలు విభాగాల్లో జాతీయ స్థాయిలో నిర్వహించిన క్రీడల్లో పతకాలు సాధించారు. 1999 నుంచి 2000 వరకు బోస్ కిరణ్ టెన్నిస్‌ను సీరియస్‌గా ఆడారు. 2002లో కిరణకు పోలీస్ శాఖలో ఉద్యోగం వచ్చింది. దీంతో కొనే్నళ్లపాటు ఆయన టెన్నిస్‌కు బ్రేక్ పడింది. అయితే తనకు ఇష్టమైన టెన్నిస్‌పై ఆసక్తి ఏ మాత్రం తగ్గలేదు. పోలీస్ అధికారిగా విధులు నిర్వహిస్తూనే సమయం దొరికినప్పుడు ఎల్‌బి స్టేడియంలో ప్రాక్టిస్ చేసేవారు. పోలీస్ టోర్నమెంట్‌లో పాల్గొని సత్తా చాటారు. ఇటీవల అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో జరిగిన ప్రపంచ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్‌లలో పాల్గొన్నారు. రెండు కాంస్య పతకాలు సాధించారు. 30 ఏళ్లు పైబడిన వారి విభాగంలో ఆడిన బోస్ సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో మెడల్స్ సాధించారు. ఈ ఘనత సాధించిన తొలి తెలంగాణ పోలీస్ క్రీడాకారుడిగా నిలిచారు. 2019లో చైనాలో జరగబోయే వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్‌లో రాణించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.

చిత్రం..ఇన్‌స్పెక్టర్ బోస్‌కిరణ్‌ను అభినందిస్తున్న డిజిపి అనురాగ్ శర్మ