తెలంగాణ

మహాదుర్గగా భద్రకాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, సెప్టెంబర్ 28: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వరంగల్ నగరంలోని చారిత్రక భద్రకాళీ దేవాలయంలో భద్ర కాళి అమ్మవారు గురువారం మహాదుర్గగా భక్తులకు దర్శన మిచ్చా రు. నవరాత్రి ఉత్సవాల ఎనిమిదివ రోజు గురువారం అష్టమి తిథి, మూలనక్షత్రం కావడంతో తెల్లవారుజామున ఆలయంలో నిత్యాహ్నికం జరిపి అమ్మవారిని భద్రకాళి మహాదుర్గగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం తరపున బహూకరించిన బంగారు కిరీటాన్ని అమ్మవారికి అలంకరించారు. ఎన్‌ఆర్‌ఐ డాక్టర్ గౌరినేని రఘునందన్‌రావు, నిహారిక దంపతులు 12 తులాల బంగారు పుస్తెలను భద్రకాళి అమ్మవారికి సమర్పించారు. నవదుర్గా పుజావిధానాన్ని అనుసరించి ఉదయం అమ్మవారికి మహాగౌరీ దుర్గాక్రమంలో, సాయంత్రం నిశుంభహా దుర్గాక్రమంలో పూజారాధనలు నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వచ్చే అష్టమి రోజును దుర్గాష్టమిగా పిలుచుకుంటూ దేశమంతా భద్రకాళిని భక్తులు పూజిస్తారు. భద్రకాళి అమ్మవారిని దుర్గ్భద్రకాళిగా, భద్రకాళి దేవాలయాన్ని కోటి యోగినీ గణాలతో భూమండలం మీద అవతరించిన ప్రదేశంగా చారిత్రక ఆధారాలు చెబుతున్నాయని వేదపండితులు చెబుతారు. తెల్లవారుజాము నుంచే వేలాదిమంది భక్తులు దేవాలయానికి చేరుకుని మహాదుర్గగా కొలువుదీరిన భద్రకాళిని దర్శించుకున్నారు. గురువారం అమ్మవారిని ఎన్‌పిడిసిఎల్ సిఎండి అన్నమనేని గోపాలరావు దంపతులు, కరీంనగర్ రేంజ్ డిఐజి రవివర్మ దంపతులు దర్శించుకున్నారు.

చిత్రం..మహాదుర్గగా అలంకరించిన దృశ్యం, అమ్మవారికి 12తులాల
బంగారు పుస్తెలు సమర్పిస్తున్న ఎన్‌ఆర్‌ఐ దంపతులు