తెలంగాణ

దశ దిశ లేని తెలంగాణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 29: బంగారు తెలంగాణ పేరుతో ప్రజల వద్దకే పాలన తెస్తున్నామని చెప్పిన ముఖ్యమంత్రి కెసిఆర్, రాష్ట్రాన్ని దశ, దిశ లేని విధంగా మార్చారని బిజెపి జాతీయ నాయకుడు నల్లు ఇంద్రసేనారెడ్డి విమర్శించారు. పది జిల్లాల నుండి 31 జిల్లాలుగా మార్చడం ద్వారా పరిపాలనా వికేంద్రీకరణ జరుగుతోందని, జిల్లా కేంద్రల కోసం ప్రజలు వందల కిలోమీటర్లు పోనవసరం లేదని చెప్పారని, జిల్లాల్లో రెవిన్యూ వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయిందని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం నాడు ఆయన పార్టీ కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడారు.
ప్రతి జిల్లాకు వంద కోట్ల రూపాయిలు కేటాయిస్తున్నామని, అన్ని శాఖలను ఒక చట్రంలోకి , ఒకే కాంప్లెక్స్‌లో ఉండేలా భవనాల నిర్మాణం చేపడతామని చెప్పారని, జిల్లాలు ఏర్పడి సంవత్సరం పూర్తవుతున్నా, జిల్లా కలెక్టరేట్లకు గానీ, జిల్లా శాఖలకు గానీ స్థల సేకరణ జరగలేదని, నిర్మాణాలు సంబంధిత కాంట్రాక్టులు ఇవ్వడంలో ఇంత వరకూ ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలకు వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. 21 కొత్త జిల్లాలకు ప్రిన్సిపల్ జడ్జీలు లేరని, గతంలో ఉన్న అధికారులను రెండు మూడు జిల్లాలకు కలిపి ఇన్‌చార్జిలుగా ఉండటం వల్ల వారు ఏ జిల్లాకూ జవాబుదారీ కావడం లేదని అన్నారు. జిల్లాల , అధికారుల మధ్య బదిలీలకు పాలసీ లేదని, జిల్లాలోని ఉపాధ్యాయులను ఎవరు బదిలీ చేయాలో కూడా ఒక విధానం లేదని అన్నారు. కొత్త కలెక్టరేట్‌లలో ఉద్యోగులకు ఆర్డర్ టు సెర్వ్ కింద పనిచేయాలని చెప్పి సంవత్సరాలు పూర్తయినా వారు ఏ జిల్లాకు చెందిన వారో అర్ధం కావడం లేదని అన్నారు. ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్‌కు ప్రజలు ఆర్జీలు పెట్టుకునే ఆనవాయితీ కూడా ఇపుడు లేదని, జిల్లా పరిషత్‌లను ఉత్సవ విగ్రహాలుగా మార్చారని అన్నారు. ప్రతి విషయానికీ ప్రతిపక్షాలు అడ్డువస్తున్నాయని, కుట్రలు పన్నుతున్నారని , కోర్టులకు వెళ్తున్నారని అబండాలు వేస్తున్న ముఖ్యమంత్రి వెంటనే నిధులు విడుదల చేసి, జిల్లా కలెక్టరేట్‌ల స్థలాలను గుర్తించడంలో ఎవరు అడ్డువస్తున్నారో సిఎం చెప్పాలని అన్నారు.
అలాగే హైదరాబాద్ పాతబస్తీలో ముస్లిం కుటుంబాల నుండి టీనేజీ అమ్మాయిలను దుబాయ్, మధ్యప్రాచ్య దేశాల షేక్‌లకు ఇచ్చి పెళ్లిళ్లు చేసే తతంగం గత 30 ఏళ్లుగా కొనసాగుతోందని, రాష్ట్ర పోలీసులు ఇతర ప్రాంతాల్లో విచారణ జరపడంలో ఇబ్బందులున్నాయని కనుక ఈ వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

చిత్రం..పార్టీ కార్యాలయంలో శుక్రవారం విలేఖరులతో మాట్లాడుతున్న బిజెపి నేత ఇంద్రసేనారెడ్డి