తెలంగాణ

ఉగ్రవాద ఖైదీల బ్యారక్ మార్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 29: హైదరాబాద్‌లోని చంచల్‌గూడ కేంద్ర కారాగారం నుంచి పారిపోయేందుకు యత్నించిన ఐసిస్ ఉగ్రవాదులను ప్రస్తుతం ఉన్న బ్యారక్ నుంచి మరో బ్యారక్‌కు మార్చారు. ఈ బ్యారక్‌లో ముగ్గురు ఉగ్రవాదులు విచారణ ఖైదీలుగా ఉన్నారు. వీరిని జైలు అధికారులు హై సెక్యూరిటీ బ్యారక్‌లో ఉంచారు. అయినప్పటికీ ఇటీవల వీరి బంధువులు ములాఖత్ కోసం వచ్చిన నేపథ్యంలో వారు తప్పించుకొని పారిపోయేందుకు యత్నించారు. దీంతో జైలు అధికారులు వీరిని నర్మదా బ్యారక్‌కు మార్చారు. ఈ సందర్భంగా శుక్రవారం తెలంగాణ జైళ్లశాఖ డైరెక్టర్ జనరల్ వికె సింగ్ మీడియాతో మాట్లాడారు. జైళ్లలో పటిష్ట భద్రతా చర్యలు చేపట్టామని, ఐసిస్ ఉగ్రవాదుల కోసం ములాఖత్ పేరుతో వచ్చే వారిపై నిఘా వేశామన్నారు. అదేవిధంగా మూడు నెలల పాటు ములాఖత్‌లను నిషేధించినట్టు ఆయన తెలిపారు. జైళ్లశాఖ ఆదాయం పెంచుకునేందుకు పలు పథకాలు చేపట్టామని, పరివర్తన్ కింద ఖైదీల్లో మార్పు తెచ్చామన్నారు. దాదాపు ఐదు వందల మంది మహిళా ఖైదీలకు ఉపాధి కల్పించామని, జైలు నుంచి విడుదలైన 50శాతం మంది ఖైదీలకు ఉపాధి కోసం, వృత్తి విద్యా కోర్సులు ప్రవేశపెట్టామన్నారు. తెలంగాణలో క్రైం రేటు తగ్గడమే కాకుండా వివిధ జైళ్లలో ఉన్న ఖైదీల్లో మార్పు వచ్చిందని, సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదలకు చర్చలు జరుపుతున్నామన్నారు. జైళ్లలో సిసి కెమెరాలతో భద్రత పెంచామని, ఉగ్రవాద ఖైదీల కదిలికలపై నిఘా పెంచామన్నారు.