తెలంగాణ

కేంద్రంలో ఉన్న 14 లక్షల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 1: కేంద్రంలో ఖాళీగా ఉన్న 14 లక్షల ఉద్యోగ ఖాళీల భర్తీకి వెంటనే చర్యలు చేపట్టాల్సిందిగా బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కృష్ణయ్య ఆదివారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. కేంద్రంలో మొత్తం 56 లక్షల ఉద్యోగాలు ఉండగా, ప్రస్తుతం 42 లక్షల మంది మాత్రమే పని చేస్తున్నారని, ఇందులో రైల్వేలో 2 లక్షల 30 వేలు, 244 ప్రభుత్వ రంగ సంస్థల్లో 4 లక్షలు, జాతీయ భ్యాంకుల్లో లక్షా 20 వేలు, రక్షణ శాఖలో 3 లక్షల 30 వేలు, 72 ప్రభుత్వ శాఖల్లో 2 లక్షల 80 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఆయన వివరించారు. ఈ ఖాళీలు భర్తీ చేయకపోవడంతో ప్రభుత్వ సామర్థ్యం దెబ్బతింటున్నదని, పైగా నిరుద్యోగులుగా ఉన్న యువకులు నిరాశకు లోనవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పాలనలో, అధికార యంత్రాంగంలో బిసిల ప్రాతినిధ్యం పెరగడం లేదని ఆయన తెలిపారు. కేంద్రంలో 1994 నుంచి 27 శాతం బిసి రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయని, కానీ ఉద్యోగ నియామకాలు జరగడం లేదని ఆయన పేర్కొన్నారు. 56 శాతం జనాభా గల బిసిలకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో 9 శాతం ప్రాతినిధ్యం లేదంటే ఈ వర్గాలకు ఎంత అన్యాయం జరుగుతున్నదో ఆలోచించాలని ఆయన కోరారు. మొత్తం ఉద్యోగాలు భర్తీ చేస్తే బిసి ఉద్యోగుల శాతం పెరుగుతుందని కృష్ణయ్య ప్రధానికి రాసిన లేఖలో వివరించారు.