తెలంగాణ

వాయదా పడిన సీనియర్ సిటిజన్స్ డే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 29: వరుసగా సెలవులు రావడంతో అక్టోబర్ ఒకటో తేదీన నిర్వహించాల్సిన సీనియర్ సిటిజన్ దినోత్సవాన్ని వచ్చేనెల రెండో వారానికి వాయిదా వేస్తున్నట్టు వికలాంగుల సంక్షేమ శాఖ సంచాలకులు శైలజ తెలిపారు. ప్రతి ఏటా అక్టోబర్ సీనియర్ సిటిజన్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని , ఈ ఏడాది కూడా ఒకటో తేదీన నిర్వహించాలని తొలుత భావించినా, వరుసగా దసరా, మొహరం పండుగలతో పాటు గాంధీ జయంతి రావడంతో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్టు తెలిపారు. సీనియర్ సిటిజన్ దినోత్సవాన్ని అక్టోబర్ ఒకటో తేదన నిర్వహించే బదులు అక్టోబర్ రెండో వారంలో నిర్వహిస్తామని ఆమె అన్నారు. ఇప్పటికే సంబంధిత శాఖలన్నింటికీ సమాచారం కూడా ఇచ్చినట్టు ఆమె చెప్పారు. సీనియర్ సిటిజన్ డే పురస్కరించుకుని ప్రతి జిల్లా కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఆమె సూచించారు.