తెలంగాణ

తమిళనాడు తరహాలో బిసిలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 29: తమిళనాడు తరహాలో రాష్ట్రంలోనూ బిసిలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఎఐసిసి నాయకుడు, మాజీ ఎంపి వి.హనుమంత రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. క్రిమిలేయర్‌ను ఎత్తివేయాలని ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ డిమాండ్ చేశారు. టిఆర్‌ఎస్ అధికారం చేపట్టిన తర్వాత బిసిలకు ఒరిగింది ఏమీ లేదన్నారు. బిసి సబ్-ప్లాన్ అమలు చేయాలని ఆయన కోరారు. బిసిలకు ఫీజు రీయంబర్స్‌మెంట్ ఎందుకు చెల్లించడం లేదని ఆయన ప్రశ్నించారు. బిసిల సంక్షేమం పట్ల ముఖ్యమంత్రి కెసిఆర్‌కు చిత్తశుద్ధి లేదని ఆయన విమర్శించారు. రాష్ట్ర సచివాలయాన్ని సికింద్రాబాద్‌లోని బైసన్ గ్రౌండ్‌కు తరలించాలన్న ప్రతిపాదనను విరమించుకోవాలని విహెచ్ డిమాండ్ చేశారు.
ప్రగతి ఏమిటి?: పొంగులేటి ప్రశ్న
ఎఐసిసి కార్యదర్శి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి విజయ దశమికి సంవత్సరం పూర్తి అవుతున్నందున సాధించిన ప్రగతి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కమిషనర్‌పై టిఆర్‌ఎస్ నాయకులు దాడి చేసినా ఇంత వరకు కేసు నమోదు చేయలేదని, రైతులకు బేడీలు వేశారని, మహిళా కలెక్టర్లపై అధికార పార్టీ ఎమ్మెల్యేల దౌర్జన్యాలు, రాజకీయ వత్తిళ్ళు పెరిగాయని ఆయన విమర్శించారు. సింగరేణి ఎన్నికల్లో అధికార పార్టీ నియమ, నిబంధనలు తుంగలో తొక్కిందని ఆయన విమర్శించారు.