తెలంగాణ

శ్లాబ్ కూలి ఇద్దరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్మూర్, సెప్టెంబర్ 29: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం ఆలూర్ గ్రామంలో శుక్రవారం సాయంత్రం స్లాబ్ కూలి ఇద్దరు మృతి చెందారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆలూర్ గ్రామంలోని కండె రాయుడు ఆలయం వద్ద దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నవమి సందర్భంగా మానాయి కోసం గొర్రెలను బలి ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని చూడడానికి గ్రామస్థులు అధిక సంఖ్యలో ఆ ప్రాంతానికి చేరుకున్నారు. కొంతమంది పక్కనే ఓ స్లాబ్‌పై నిలబడ్డారు. మరికొంతమంది ఆ ఇంటి కింద నిల్చున్నారు. స్లాబ్‌పై ఎక్కువ మంది నిల్చోవడంతో ఒక్కసారిగా స్లాబ్ కూలి కింద ఉన్న వారిపై పడింది. దీంతో గోసంగి యశోద (30), పుట్ట హారిక (7) అక్కడికక్కడే మరణించారు. ఈ సంఘటనలో చాలామంది గాయపడ్డారు. గాయపడిన వారిని గ్రామస్థులు ఆర్మూర్‌లోని ఆసుపత్రులకు చికిత్స నిమిత్తం వాహనాల్లో తరలించారు. విషయం తెలుసుకున్న ఎసిపి శివకుమార్, ఎస్‌హెచ్‌ఓ సీతారాం, ఎస్‌ఐ సంతోష్ సంఘటన స్థలాన్ని సందర్శించారు. సంఘటనకు సంబంధించిన వివరాలను ప్రత్యక్ష సాక్షులను అడిగి తెలుసుకున్నారు. మృతి చెందిన యశోదకు భర్త బాల్‌రాజ్, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌ఓ సీతారాం తెలిపారు.

చిత్రం..గాయపడిన వారిని పరామర్శిస్తున్న ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి