తెలంగాణ

భూ నిర్వాసితుల త్యాగం వెలకట్టలేనిది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మర్రిగూడ, సెప్టెంబర్ 29: ఆరుగాలం కష్టపడి వ్యవసాయం చేసుకుంటూ అన్నం పెట్టే భూములను ప్రాజెక్టు నిర్మాణానికి ఇచ్చే భూ నిర్వాసితుల త్యాగం వెలకట్టలేనిదని తెలంగాణ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలోని చర్లగూడెంలో భూ నిర్వాసితులు చేపట్టిన నిరవధిక ధర్నా నెలరోజులకు పైగా కొనసాగుతుండడంతో శుక్రవారం ధర్నా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపిన సందర్భంగా ఆయన మాట్లాడారు. పైలాన్ ఆవిష్కరణ సమయంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి కూడా అమలుకు నోచుకోలేదని విమర్శించారు.
భావితరాలకు భవిష్యత్‌ను ఇచ్చే చర్లగూడెం రిజర్వాయర్ నిర్మాణంలో భూములను కోల్పోతున్న బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున భరోసా ఏదని ఆయన ప్రశ్నించారు. భూ నిర్వాసితులు అధైర్యపడవద్దని, ఐక్యమత్యంగా నిలబడి ప్రభుత్వంపై పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రధానంగా న్యాయమైన నష్టపరిహారం వచ్చే వరకు చేపట్టే పోరాటంలో మహిళలు ముందువరుసలో నిలబడాలని కోరారు. మన ఓట్లతో పుట్టిన ప్రభుత్వం మన వద్దకు వచ్చి నష్టపరిహారాన్ని చెల్లించకుండా పోలీసుల చేత బెదిరింపులకు పాల్పడడమేంటని విమర్శించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే న్యాయమైన పోరాటం కొనసాగిద్దామన్నారు. నిర్వాసితులు తొందరపడి దళారుల చేతుల్లో మోసపోయి సంతకాలు చేయవద్దని సూచించారు. ముఖ్యమంత్రి కెసిఆర్, భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు నిర్వాసిత గ్రామాల్లో పర్యటిస్తే బాధితుల గోడు వినిపిస్తుందని పేర్కొన్నారు. రైతుల ఉసురుపోసుకున్న ఏ ప్రభుత్వం అధికారంలో కొనసాగిన దాఖలాలు లేవన్నారు. పోలీసులతో బెదిరిస్తే భూములను ఇస్తారనుకోవడం భ్రమని అన్నారు.
ఎకరాకు 15 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని చెల్లించడంతో పాటు ఇంటికో ప్రభుత్వ ఉద్యోగంలాంటి అంశాలపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరి వెల్లడించిన తర్వాతే ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం మొండికి పోయి నిర్వాసితులను బెదిరిస్తే మల్లన్నసాగర్ తరహా ఉద్యమం చర్లగూడెం రిజర్వాయర్ పరిధిలో పునరావృతమవుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి అనంతరాజుగౌడ్, జెఎసి నాయకులు గోవర్ధన్‌రెడ్డి, చల్మారెడ్డి, కవిత, పురుషోత్తం, తిప్పర్తి కాశయ్య, శేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..చర్లగూడెంలో భూ నిర్వాసితుల ధర్నాలో మాట్లాడుతున్న కోదండరామ్