తెలంగాణ

వలస కార్మికుల సమస్యలపై ఐక్య పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 1: వలస కార్మికుల సమస్యలపై ఐక్య పోరాటం సాగిద్దామని సిఐటియు పిలుపునిచ్చింది. తెలంగాణ ఏర్పడి మూడేళ్లయినా అనేక రంగాల్లో కనీస హక్కులకు నోచుకోవడం లేదని, వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉందని సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు, ప్రధాన కార్యదర్శి ఎం.సాయిబాబు తెలిపారు. ఆదివారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 3న సందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘వలస కార్మికుల సమస్యలపై ఐక్య పోరాటాలు’ అనే అంశంపై సదస్సును విజయవంతం చేయాలని వారు కార్మిక వర్గాన్ని కోరారు. గ్రామాల నుంచి పట్టణాలకు వలస వెళుతున్న కార్మికుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోందని, పట్టణాల్లో అసంఘటిత రంగ కార్మికులకు పనుల లేక నానా ఇబ్బందులు పడుతున్నారని వారు తెలిపారు. ఇటువంటి వారి హక్కుల సాధన కోసం యావత్ కార్మిక వర్గం అండగా నిలువాలని, ఇందుకు ఐక్య ఉద్యమాలు సాగించాలని కోరారు.