తెలంగాణ

బిసి బిడ్డను మంత్రి పదవినుంచి తప్పిస్తారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 1: వెనుకబడిన వర్గానికి చెందిన బండారు దత్తాత్రేయను కేంద్ర మంత్రివర్గం నుంచి తప్పించడం వల్ల బిసిలంతా బాధపడ్డారని ఎఐసిసి నాయకుడు, మాజీ ఎంపీ వి. హనుమంత రావు తెలిపారు. ‘అలయ్-బలయ్’లో విహెచ్ ప్రసంగిస్తూ బిసి నేతను మంత్రివర్గం నుంచి ఎలా తప్పిస్తారని ప్రశ్నించారు. బిసిలు బాధ పడుతున్న విషయాన్ని ప్రధానికి, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు చెప్పాలంటూ ఆయన వేదికపై ఉన్న కేంద్ర మంత్రి హన్సరాజ్ గంగారామ్ హయర్‌ను కోరారు. ఆ తర్వాత గంగారామ్ ప్రసంగిస్తూ దత్తాత్రేయను తొలగించినందుకు బిసిలు ఎవరూ బాధ పడాల్సిన అవసరం లేదని, ప్రధాని మోదీయే బిసి అని ఆయన చెప్పారు. దత్తాత్రేయ సేవలను పార్టీ ఉపయోగించుకుంటుందని, ఆయనకు బంగారు భవిష్యత్తు ఉందని తెలిపారు. టిఆర్‌ఎస్ ఎంపి కె.కేశవరావు ప్రసంగిస్తూ దత్తాత్రేయకు పదవి ఉన్నా లేకున్నా ఆ గౌరవం ఉంటుందన్నారు. దత్తాత్రేయకు పదవి వల్ల పేరు రాదని, పదవికే వనె్న వస్తుందన్నారు. టి.జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ ఎం. కోదండరామ్ ప్రసంగిస్తూ విహెచ్ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నానని అన్నారు.