తెలంగాణ

స్వచ్ఛ భారత్ మిషన్‌లో తెలంగాణకు అవార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 2: స్వచ్ఛ్భారత్ లక్ష్యంలో భాగంగా చేపట్టిన స్వచ్ఛతా మిషన్ కింద తెలంగాణ రాష్ట్రానికి అవార్డులు లభించాయి. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని విజ్ఞాన్ భవన్‌లో ‘స్వచ్ఛ భారత్ దివస్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. సిరిసిల్ల-సిద్దిపేట మున్సిపాలిటి పరిధితో సేకరించిన వ్యర్థ పదార్థాలను తిరిగి వినియోగంలోకి తీసుకువచ్చేలా చేపట్టిన డ్రై రిసోర్స్ కలెక్షన్ సెంటర్‌కుగాను కేంద్రం పురస్కరాన్ని అందజేసింది. ఈ అవార్డును కేంద్ర మంత్రులు హర్‌దీప్ సింగ్ పూరి, ఎస్‌ఎస్ అహ్లూవాలియాల చేతుల మీదుగా సిరిసిల్ల మున్సిపన్ చైర్‌పర్సన్ సామల పావని దేవదాస్, సిరిసిల్ల మున్సిపాల్ కమిషనర్ రామాంజుల రెడ్డి, సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ రమణాచారి అందుకున్నారు. పూర్తిస్థాయిలో 100 శాతం బహిరంగ మల విసర్జన రహిత (ఓడిఎఫ్) సాధించిన జిల్లాగా జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు అవార్డు లభించింది. ఈ అవార్డును ఆ జిల్లాల కలెక్టర్లు శరత్, కృష్ణ భాస్కర్ అందుకున్నారు.

చిత్రాలు.. సిరిసిల్ల జిల్లాకు లభించిన స్వచ్ఛత అవార్డును కేంద్రమంత్రి హర్‌దీప్ సింగ్ పూరి చేతుల మీదుగా అందుకుంటున్న కలెక్టర్ కృష్ణ భాస్కర్.
*సిరిసిల్ల-సిద్ధిపేట్ మున్సిపాలిటీలకు లభించిన స్వచ్ఛత అవాఠ్డును కేంద్రమంత్రులు అహ్లూవాలియా,హర్ దీప్‌సింగ్ పూరి చేతుల మీదుగా స్వీకరిస్త్తున్న సిరిసిల్ల మున్సిపల్ చైర్‌పర్సన్ సామల పావని దేవాదాస్,రాష్ట్ర స్వచ్ఛ భారత్ మిషన్ డైరెక్టర్ శ్రీదేవి,సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ రామంజుల రెడ్డి,సిద్ధిపేట్ మున్సిపాల్ కమిషనర్ కె.వి రమణాచారి