తెలంగాణ

కోదండరాం కాంగ్రెస్ నాయకుడే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 2: తెలంగాణ వద్దన్న పార్టీలతో అంటకాగుతూ, కాంగ్రెస్ అజెండాను భుజాన వేసుకుని తిరుగుతున్న టిజెఏసి చైర్మన్ ప్రొ.కోదండరాం మా దృష్టిలో కాంగ్రెస్ నాయకుడేనని తెరాస ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. టిజెఏసి చైర్మన్‌గా చెప్పుకునే కోదండరాం కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేయడం ఏమిటని ప్రశ్నించారు. కోదండరాం తలపెట్టిన సత్యాగ్రహాన్ని విరమించుకోవాలని లేదంటే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ప్రభాకర్ తీవ్ర స్ధాయిలో ధ్వజమెత్తారు. టిఆర్‌ఎస్ ఎల్సీ కార్యాలయంలో సోమవారం ఆయన మరో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతు సమన్వయ సమితులను రద్దు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తే దానిని సమర్దిస్తూ కోదండరాం దీక్ష చేస్తాననడం దారుణమని అన్నారు. అసలు సత్యాగ్రహం ఎందుకు చేయాలని తలపెట్టారో తెలియజేయాలని వారు కోదండను డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలు ఇప్పుడిప్పుడే పాలన పరమైన ఫలాలు అందుకుంటున్నందుకు సత్యాగ్రహం చేస్తున్నారా..? అని ప్రశ్నించారు. సింగరేణి ఎన్నికల్లో టిబిజికెఎస్‌ను ఓడించాలని కోదండరామ్ పిలుపునివ్వడం అంటే ఆయన కాంగ్రెస్ కోసం పని చేస్తున్నారని ప్రజలకు అర్ధమైందని అన్నారు. కోదండరామ్‌కు నిజంగా తెలంగాణ గడ్డపై ప్రేమ ఉంటే అభివృద్ధిని అడ్డుకునే కుట్రలు ఆపాలని వారు డిమాండ్ చేశారు.