తెలంగాణ

ఐలయ్యపై మీ వైఖరేంటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 2: ప్రొ.కంచె ఐలయ్య వ్యవహార శైలిపై కాంగ్రెస్ పార్టీ వైఖరేంటో స్పష్టం చేయాలని ఆర్యవైశ్య సంఘం టిపిసిసి అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డిని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆర్యవైశ్య సంఘం ఒక లేఖను ఉత్తమ్‌కుమార్ రెడ్డికి రాసింది. ఆర్యవైశ్యులను లక్ష్యంగా చేసుకుని ఐలయ్య రాసిన పుస్తకం, తదనంతరం చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు స్పందించలేదని ఆ లేఖలో పేర్కొన్నారు. ‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’ అనే శీర్షికన ప్రచురించిన పుస్తకంపై ఎఐసిసి నేతలు మాత్రం ఢిల్లీలో కంచె ఐలయ్యకు మద్దతుగా మాట్లాడారని సంఘం పేర్కొంది. కాంగ్రెస్ పార్టీ తమ మనోభావాలను పట్టించుకోవడం లేదని అన్నారు. ఐలయ్య రాసిన పుస్తకాన్ని నిషేధించేందుకు ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సంఘం టిపిసిసి అధ్యక్షుడిని డిమాండ్ చేసింది.