తెలంగాణ

18 నుంచి టిడిపి కరవు యాత్రలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 16: రాష్ట్రంలో కరవు పరిస్థితులను అంచనా వేసేందుకు తెలుగు దేశం పార్టీ ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు పర్యటించాలని నిర్ణయించింది. జిల్లాల్లో 18 నుంచి 25వ తేదీ వరకు 10 బృందాలు క్షేత్ర స్థాయిలో పర్యటించనున్నట్లు టిడిపి సీనియర్ నాయకుడు, మాజీ ఎంపి రావుల చంద్రశేఖర్ రెడ్డి శనివారం విలేఖరుల సమావేశంలో తెలిపారు. ఒక్కో బృందంలో ముగ్గురు సభ్యులు ఉంటారని ఆయన తెలిపారు. ఈ బృందాలు కరవు పరిస్థితులను తెలుసుకుని ఆయా జిల్లా కలెక్టర్లకు అందజేస్తాయని, అనంతరం తాము ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేస్తామని ఆయన వివరించారు. అంతేకాకుండా రాబోయే పార్లమెంటు సమావేశాల్లోనూ తమ పార్టీ ఎంపీలు ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకుని వస్తారని ఆయన తెలిపారు. కరవు పరిస్థితులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఫామ్‌హౌస్‌కు పరిమితమవుతున్నారని, లేదంటే విపక్షాలను బలహీనపరిచేందుకు ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని ఆయన విమర్శించారు. రైతులకు చెల్లించే ఇన్‌పుట్ సబ్సిడీ విషయంలోనూ ప్రభుత్వం స్పష్టమైన విధానం ప్రకటించడం లేదని ఆయన విమర్శించారు.