తెలంగాణ

‘పునరుజ్జీవ’మే శ్రీరాంసాగర్‌కు ప్రత్యామ్నాయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, అక్టోబర్ 3: రాష్ట్రంలోని భారీ ప్రాజెక్టులలో ఒకటైన నిజామాబాద్ జిల్లా పోచంపాడ్‌లోని శ్రీరాంసాగర్ జలాశయానికి పునరుజ్జీవ పథకమే ప్రత్యామ్నాయ ఆధారంగా మారింది. పునరుజ్జీవ పథకం నామకరణంతో తెరాస ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రివర్స్ పంపింగ్ పనులు ఎలాంటి అవాంతరాలు లేకుండా సకాలంలో సాఫీగా పూర్తయితేనే ఉత్తర తెలంగాణ వరప్రదాయినిగా విలసిల్లుతున్న శ్రీరాంసాగర్ రిజర్వాయర్‌కు పూర్వవైభవం చేకూరనుంది. లేనిపక్షంలో ఈ ప్రాజెక్టు నీటి నిల్వలు సంతరించుకోక బోసిపోయే ప్రమాదం ఏర్పడింది. గోదావరి నీటిపైనే పూర్తిగా ఆధారపడి ఎస్సారెస్పీని నిర్మించగా, ఎగువ భాగంలో మహారాష్ట్ర బాబ్లీ సహా ఇబ్బడిముబ్బడిగా నలభైకి పైగా చిన్నచిన్న రిజర్వాయర్లు, బ్యారేజీలను నిర్మించింది. దీంతో కుండపోత వర్షాలు కురిసి ఎగువన గల మహారాష్టల్రోని ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో నిండితే తప్ప, మిగులు జలాలు దిగువకు ప్రవహిస్తూ ఎస్సారెస్పీలోకి వచ్చి చేరే పరిస్థితి లేకుండాపోయింది. ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురియకపోవడంతో వర్షాకాలం సీజన్ ముగింపు దశకు చేరుకున్నప్పటికీ, ఎస్సారెస్పీలోకి 45 టిఎంసిల వరకే వరద జలాలు వచ్చి చేరాయి. నిజానికి జూలై నెలాఖరు నుండి ఆగస్టు రెండవ వారంలోపే కొన్ని పర్యాయాలు ఎస్సారెస్పీ పూర్తిస్థాయి నీటిమట్టాన్ని సంతరించుకోగా, ఎక్కువగా సెప్టెంబర్‌లో ఈ రిజర్వాయర్ నిండుదనాన్ని సంతరించుకునేది. అయితే ఈసారి సెప్టెంబర్ సెంటిమెంట్ కూడా కలిసి రాలేదు. ప్రస్తుతం ఎగువ ప్రాంతం నుండి వరద ప్రవాహం పూర్తిగా నిలిచిపోయింది. దీంతో 1091.00 అడుగులు, 90 టిఎంసిల పూర్తిస్థాయి సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్టులో 38 టిఎంసిల నీటి నిల్వలు మాత్రమే మిగిలి ఉన్నాయి. రబీ పంటలకు నీరందించే అవకాశం ఉంటుందని ఆయకట్టు రైతులు ఆశించినప్పటికీ, సరిపడా నీటి నిల్వలు వచ్చి చేరకపోవడం ఆందోళన కలిగించే పరిణామంగా మారింది. ఆయకట్టుకు రబీ పంటలకు నీరందించాలంటే ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిని అవలంభించినా, కనీసం 45 టిఎంసిల నీరు అవసరం అవుతుంది. అయితే ప్రస్తుతం ఎస్సారెస్పీలో 38 టిఎంసిల జలాలు మాత్రమే మిగిలి ఉండడం, డిసెంబర్ నాటికి అందులో 4 టిఎంసిల వరకు నీరు ఆవిరి, లీకేజీల రూపంలో వృథా అవుతోందని అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా తాగునీటి అవసరాలకు కొంతమేర అట్టిపెట్టడం, మరో ఐదు టిఎంసిలను డెడ్‌స్టోరేజీగా పరిగణిస్తారు. ఈ లెక్కన రబీ సీజన్ నాటికి ఎస్సారెస్పీలో మిగిలేది పాతిక టిఎంసిలేనని స్పష్టమవుతోంది. ఇది రబీ పంటలకు ఏమాత్రం సరిపోదని ప్రస్తుత నీటి నిల్వల స్థితిగతులను బట్టి తెలుస్తోంది. ఈ నెల 28వ తేదీ నాటితో బాబ్లీ ప్రాజెక్టు గేట్లను కూడా మూసివేయనున్న నేపథ్యంలో, ఈ సీజన్‌లో వచ్చే మూడు వారాల్లోపు భారీగా వరద జలాలు వచ్చి చేరితే తప్ప ఎస్సారెస్పీ పూర్తిస్థాయి నీటిమట్టాన్ని సంతరించుకునే అవకాశాలు ఏ కోశానా కనిపించడం లేదు. గడిచిన ఐదేళ్ల కాలంలో ఇదే తరహాలో మూడేళ్లపాటు ఎస్సారెస్పీ అరకొర ఇన్‌ఫ్లోలకే పరిమితం కావాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో పునరుజ్జీవ పథకంపైనే ఎస్సారెస్పీ మనుగడ ఆధారపడినట్లయ్యింది. కాళేశ్వరం నీటిని రివర్స్ పంపింగ్ విధానంలో వరద కాల్వ ద్వారా రోజుకో టిఎంసి చొప్పున 60 టిఎంసిలను ఎస్సారెస్పీలోకి మళ్లించేలా పునరుజ్జీవ పథకాన్ని రూపొందించారు. ఏడాది కాలం లోపే ఈ పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్దిష్ట గడువు విధించింది. ఆశించిన విధంగానే సకాలంలో పునరుజ్జీవ పథకం పనులు పూర్తయితేనే ఎస్సారెస్పీ ఆయకట్టుకు ప్రత్యామ్నాయం లభించినట్లవుతుంది. అప్పుడే నిజామాబాద్‌తో పాటు ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాలలో సుమారు 14 లక్షల ఎకరాల విస్తీర్ణానికి ఖరీఫ్, రబీ సీజన్‌లలో సమృద్ధిగా సాగు జలాలు అందుబాటులోకి వస్తాయి.

నిండుకుండలా సింగూర్
* 29.4 టిఎంసిలకు చేరిన నీటిమట్టం * 14 మెగావాట్ల జల విద్యుదుత్పత్తి ప్రారంభం
* ఖరీఫ్, రబీలకు కలిసొచ్చిన కాలం!

సంగారెడ్డి, అక్టోబర్ 3: ఎగువ ప్రాంతాలైన మహారాష్ట్ర, కర్నాటకలో కురుస్తున్న వర్షానికి మంజీర నది పరవళ్లు తొక్కుతోంది. నవంబర్ మాసాంతం, అక్టోబర్ నెల ఆరంభంలో మహారాష్ట్ర, కర్నాటకల్లో భారీ వర్షాలు కురియడంతో మంజీర నదికి వరద నీరు ఒక్కసారిగా పోటెత్తింది. దసరా సందర్భంగా దేవి శరన్నవరాత్రి వేడుకలను సైతం ఉత్సవ విగ్రహాలకే నిర్వహించారు. కాగా, ఈసారి వర్షాలు అంతంత మాత్రమే ఉండటంతో సింగూర్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండుతుందా లేదా అన్న సందేహాలు తొలగిపోయాయి. ఎగువన కురుస్తున్న వర్షానికి సింగూర్ ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. మంగళవారం కేతేపల్లి, అక్టోబర్ 3: సూర్యాపేట జిల్లాలో రెండవ అతిపెద్ద సాగునీటి ప్రాజెక్టు అయిన మూసీ నదికి వరద పోటెత్తడంతో మంగళవారం అధికారులు ప్రాజెక్టు ఆరుగేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. మూసీ ఎగువ ప్రాంతాల్లో విస్తారమైన వర్షాలు కురుస్తుండడం, హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుండి 50 వేల క్కూసెక్కుల వరద ప్రవాహం చేరుతుండడంతో ప్రాజెక్టు క్రస్టుగేట్లు 2, 3, 4, 7, 8, 9 గేట్లను మూడు అడుగుల మేర ఎత్తి 12 వేల క్కూసెక్కుల నీటిని దిగువ మూసీకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా ప్రస్తుతం 642.8 అడుగులుగా ఉంది రంగారెడ్డి, హైదరాబాద్ సోమవారం రాత్రి భారీవర్షం కురవడంతో ప్రాజెక్టు నుండి ముందస్తుగా నీటిని విడుదల చేస్తున్నట్లు డిఈ నవికాంత్, ఎఈ మమత తెలిపారు. ప్రాజెక్టులోకి వరద ప్రవాహం వచ్చిచేరిన తర్వాత ప్రాజెక్టులో 644.6 అడుగుల సామర్ధ్యం ఉండేట్లు చూస్తామన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 3000 వేల క్కూసెక్కుల నీరువచ్చి చేరుతోంది.

మధ్యాహ్నానికి 7 వేల పైచిలుకు క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరగా సాయంత్రానికి 4 వేల క్యూసెక్కులకు తగ్గింది. ఆగస్టు నెలాఖరుకు సింగూర్ ప్రాజెక్టులో కనీసం 20 టిఎంసిల నీటి నిల్వ కూడా లేకపోవడంతో రబీ సాగు ప్రశ్నార్థకంగా కనిపించింది. ఖరీఫ్‌లో సాగు చేసిన వరి పంట సజావుగానే పండినా రబీకి సాగు నీరు అందించడం కష్టమేమో అనిపించింది. సింగూర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం ఉంటే దిగువన ఉన్న ఘన్‌పూర్, నిజాంసాగర్‌లకు పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. సింగూర్ కాలువలు, ఘన్‌పూర్ కాలువల ద్వారా ఈ యేడాది కూడా రబీలో గణనీయంగా వరి సాగు కావడం ఖాయమే అని చెప్పవచ్చు. రబీ సాగుతో పాటు వేసవిలో జంట నగరాలకు తాగునీటిని సరఫరా చేయడానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తబోవని అధికారులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మొత్తమీద గత యేడాది మాదిరిగానే సింగూర్ ప్రాజెక్టు ఈ సారి కూడా మహర్దశ వచ్చిందని చెప్పవచ్చు.

బ్రాహ్మణపల్లి పాఠశాలకు 8మంది ఉపాధ్యాయులు
ఒకేసారి నియామకం * విద్యార్థులు, తల్లిదండ్రుల హర్షం
పెద్దపల్లి రూరల్, అక్టోబర్ 3: పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి రూరల్ మండలంలోని బ్రాహ్మణపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు ఎనిమిది మంది ఉపాధ్యాయులను కేటాయిస్తూ జిల్లా విద్యా శాఖ అధికారి వెంకటేశ్వర్‌రావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పోరాడి సాధించుకున్న ఈ పాఠశాలకు ఉపాధ్యాయులు కేటాయించడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులలో ఆనందం వెల్లి విరిసింది. ఈ పాఠశాలలో 29 మంది చదువుకుంటుండగా, విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందనే సాకుతో ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలో పాఠశాల మూసి వేసి, అదేచోట అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. తమ పాఠశాల యధావిధిగా కొనసాగించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో బ్రాహ్మణపల్లి పాఠశాలను యథావిధిగా కొనసాగించాలని ఇటీవల రాష్ట్ర విద్యా శాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాల ప్రారంభంలో ప్రధానోపాధ్యాయుడుతో పాటు ఒక ఉపాధ్యాయుడిని మాత్రమే కేటాయించగా, మంగళవారం మరో ఎనిమిది మంది ఉపాధ్యాయులను నియమిస్తూ జిల్లా విద్యా శాఖ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. దీనితో పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నిన్న ప్రజ్ఞాపూర్‌లో... నేడు వర్గల్‌లో..
*వైశ్యుల పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు
*తెల్లవారుజామునే వర్గల్‌కు చేరుకున్న పోలీసులు
గజ్వేల్, అక్టోబర్ 3: సిఎం కెసిఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం నుంచి వైశ్యులు తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళన బాట పట్టగా ప్రగతి భవన్‌కు తరలివెళుతున్న వైశ్య సంఘాల నేతలకు పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారు. నిన్న గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని ప్రజ్ఞాపూర్‌లో పోలీసులు ఐవిఎఫ్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్‌గుప్త బృందాన్ని అడ్డుకోగా, పాతూరు రాజీవ్ రహదారిపై ప్రేమ్‌గాంధీ అనుచరులను పోలీసులు వివిధ కారణాలను సాకుగా చూపుతూ అడ్డుకున్నారు. కొద్దిసేపటి ఆనంతరం పాదయాత్రకు దారినివ్వడంతో శ్రీనివాస్‌గుప్త తన అనుచరులతో కలిసి వర్గల్ శ్రీ విద్యాధరి క్షేత్ర అవరణలో విశ్రాంతి తీసుకోగా, మంగళవారం తెల్లవారుజామున సిఐలు వెంకటేశం, సతీష్, ఎస్సైలు శ్రీ్ధర్, కమలాకర్, వీరన్న, మదుసూధన్‌రెడ్డి నేతృత్వంలో పెద్ద ఎత్తున పోలీసులు అక్కడికి చేరుకొని డిసిఎంలను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఐవిఎఫ్ చైర్మన్ శ్రీనివాస్‌గుప్తను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా, తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో పోలీసులు సమయస్ఫూర్తితో వ్యవహరించి వెనక్కి తగ్గగా, మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో తిరిగి పాదయాత్రకు అనుమతించారు. ఈ క్రమంలో వైశ్యుల మహాపాదయాత్ర గౌరారం మీదుగా కొనసాగి ములుగు, వంటిమామిడిలకు చేరుకుంది. అయినప్పటికీ పోలీసు బృందాలు పాదయాత్రను అనుసరించడం పలు అనుమానాలకు తావిస్తుండగా, పాదయాత్రను అడ్డుకునేందుకే సర్కార్ కుట్రలు పన్నతున్నట్లు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్‌గుప్త ఆరోపించారు.
మూసీ ఆరుగేట్లు ఎత్తివేత

కేతేపల్లి, అక్టోబర్ 3: సూర్యాపేట జిల్లాలో రెండవ అతిపెద్ద సాగునీటి ప్రాజెక్టు అయిన మూసీ నదికి వరద పోటెత్తడంతో మంగళవారం అధికారులు ప్రాజెక్టు ఆరుగేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. మూసీ ఎగువ ప్రాంతాల్లో విస్తారమైన వర్షాలు కురుస్తుండడం, హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుండి 50 వేల క్కూసెక్కుల వరద ప్రవాహం చేరుతుండడంతో ప్రాజెక్టు క్రస్టుగేట్లు 2, 3, 4, 7, 8, 9 గేట్లను మూడు అడుగుల మేర ఎత్తి 12 వేల క్కూసెక్కుల నీటిని దిగువ మూసీకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా ప్రస్తుతం 642.8 అడుగులుగా ఉంది రంగారెడ్డి, హైదరాబాద్ సోమవారం రాత్రి భారీవర్షం కురవడంతో ప్రాజెక్టు నుండి ముందస్తుగా నీటిని విడుదల చేస్తున్నట్లు డిఈ నవికాంత్, ఎఈ మమత తెలిపారు. ప్రాజెక్టులోకి వరద ప్రవాహం వచ్చిచేరిన తర్వాత ప్రాజెక్టులో 644.6 అడుగుల సామర్ధ్యం ఉండేట్లు చూస్తామన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 3000 వేల క్కూసెక్కుల నీరువచ్చి చేరుతోంది.

ఖాయంగా కారుణ్య నియామకాలు

* సింగరేణి కార్మికులకు క్యాడర్ స్కీమ్ అమలుచేస్తాం
* టిబిజికెఎస్ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

కొత్తగూడెం, అక్టోబర్ 3: సింగరేణి సంస్థలో కారుణ్య నియామకాలు చేసి తీరుతామని తెలంగాణ బొగ్గు గని సంఘం (టిబిజికెఎస్) గౌరవ అధ్యక్షురాలు, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. సింగరేణి కార్మికులందరికీ క్యాడర్ స్కీంను అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో భాగంగా మంగళవారం తెలంగాణ రాష్ట్రం కొత్తగూడెంలోని గౌతంగని ఓపెన్ కాస్ట్, సింగరేణి ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో ఆమె మాట్లాడుతూ ఐదు జాతీయ కార్మిక సంఘాల నాయకులు రద్దు చేయిస్తే టిఆర్‌ఎస్ ప్రభుత్వం కారుణ్య నియమాలు చేస్తోందన్నారు. ప్రకృతికి విరుద్ధంగా పనిచేస్తున్న కార్మికులపై వృత్తి పన్ను రద్దు చేసిన ఘనత కెసిఆర్ ప్రభుత్వానిదే అన్నారు. సింగరేణిలో ఉన్న 19 వేల అలియాస్ ఉద్యోగాలను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసి, విద్యుత్ సంస్థలను లాభాల బాటలో నడిపిస్తున్నామని, అదే తరహాలో సింగరేణి సంస్థలో నూతన ప్రాజెక్టులను ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ఓపెన్ కాస్టుల్లో పనిచేస్తున్న ఇపి ఆపరేటర్ల సమస్య పరిష్కరిస్తామని, బదిలీ ఫిల్లర్లను పర్మినెంట్ చేస్తామన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో లేని కార్మిక సంఘాల వల్ల కార్మికులకు ఎలాంటి ప్రయోజనం చేకూరదని వ్యాఖ్యానించారు. ఏ కార్మిక సంఘమైనా అధికారంలో ఉన్న ప్రభుత్వం వద్దకు రావాల్సిందే అన్నారు. ఎఐటియుసి కార్మికులకు కొత్తగా ఏ హక్కులు సాధిస్తుందని ప్రశ్నించారు. డిపెండెంట్ ఎంప్లాయిమెంట్ రద్దుకు ఎఐటియుసి సాక్షి సంతకం పెట్టిందని ఆరోపించారు. సింగరేణిలో పనిచేస్తున్న కార్మికులందరికీ గృహాలలో ఎసి సదుపాయం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఖమ్మం పార్టమెంటు సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకటరావు, శాసనమండలి సభ్యుడు పల్లారాజేశ్వరరెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్ గడిపెల్లి కవిత, తదితరులు ప్రసంగించారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకులు ఆకునూరి కనకరాజు, గోపాలరావు, శంకర్‌నాయక్, భానోత్ కేస్లీ, జికె సంపత్, జెవి ఎస్ చౌదరి, ఆళ్ళ మురళి, సంగం చందర్, కూసన వీరభద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

జూరాల కాలువలో ముగ్గురు గల్లంతు
* ఒకరి మృతదేహం లభ్యం *తల్లీ, కూతురు కోసం గాలింపు
గద్వాల, అక్టోబర్ 3: జూరాల కుడి కాలువలో ముగ్గురు గల్లంతయ్యారు. ఈ సంఘటన మంగళవారం గద్వాల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... తూర్పుదౌదర్ పల్లికి చెందిన రాజేష్, సునీత (25) భార్యాభర్తలు. వీరికి అమృత (5), వైష్ణవి (3) సంతానం. మళ్లీ సునీత నిండు గర్బిణి. రాజేష్ హమాలి పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఉమ్మడి కుటుంబంగా జీవిస్తున్న భార్యాభర్తల మధ్య సోమవారం రాత్రి చిన్నపాటి ఘర్షణ చోటుచేసుకుంది. మంగళవారం మధ్యాహ్నం సునీత క్షణికావేశంతో బీరెల్లి రోడ్డులో గల జూరాల కుడికాలువ పిల్లలతో సహా దూకి ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు మృతదేహం కోసం జమ్ములమ్మ రిజర్వాయర్లో గాలింపు చర్యలు చేపట్టారు. వీరిలో వైష్ణవి మృతదేహం లభ్యం కాగా మిగతా వారి కోసం గాలిస్తున్నారు.

సింగరేణి ఎన్నికలకు సర్వం సిద్ధం

కొత్తగూడెం, అక్టోబర్ 3: సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల నిర్వాహణకు డిప్యూటీ లేబర్ కమిషనర్ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 5వ తేదీన జరిగే గుర్తింపు సంఘం ఎన్నికల్లో సింగరేణి వ్యాప్తంగా 53,146 మంది కార్మికులు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల్లో 92 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేసి 800 మంది సిబ్బందిని నియమించింది. సింగరేణి రీజన్ స్థాయిలో ఎన్నికల పర్యావేక్షణ కోసం రెవెన్యూ డివిజన్ స్థాయి అధికారిని నియమించగా ఏరియాల్లో తాహశీల్దార్ నియమకానికి చర్యలు చేపట్టింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత తొలిసారిగా జరుగుతున్న సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలను ప్రధాన రాజకీయ పార్టీలతోపాటు కార్మిక సంఘాలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని హోరాహోరీగా ఎన్నికల ప్రచారం చేశాయి. తెలంగాణ ప్రాంతంలోని మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలోని 11 ఏరియాల వారిగా ఓటర్ల వివరాలు ఇలా ఉన్నాయి. బెల్లంపల్లి ఏరియాలో 1725, భూపాలపల్లిలో 6733, కొత్తగూడెం కారోపరేటులో 1497, కొత్తగూడెం ఏరియాలో 37108, మందమర్రిలో6539, మణుగూరులో 2866, రామగుండం-1 7117, రామగుండం-2 4240, రామగుండం-3 5482, శ్రీరాంపూర్ 12107, ఇల్లందు 1132 మంది కార్మికులు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నికల సందర్భంగా కోల్ బెల్ట్ ఏరియాలో రెండు రోజులపాటు మద్యం షాపులు మూసివేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు, సింగరేణి సెక్యూరిటి సిబ్బంది బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అక్టోబర్ 5వ తేదీ ఉదయం 7 గంటల నుండి 92 పోలింగ్ బూత్‌లలో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అదే రోజు ఓట్ట లెక్కింపు చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

గొర్రెల పథకానికి అపవాదు తేవద్దు

ఆదిలాబాద్, అక్టోబర్ 3: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల యూనిట్ల పంపిణీలో ప్రభుత్వ ప్రతిష్టతను దిగజార్చవద్దని, ఈ పథకం లోటుపాట్లను సరిదిద్ది ఇకపై మేలు జాతి గొర్రెలను పంపిణీ చేస్తామని బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ పట్టణంలోని జనార్ధన్‌రెడ్డి గార్డెన్‌లో ఆదిలాబాద్ జిల్లా గొల్లకుర్మ సహకార సంఘాల సభ్యులతో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ కుల వృత్తులను ఆదరించేందుకే దేశంలో ఎక్కడా లేనివిధంగా భారీ సబ్సిడీపై గొర్రెల యూనిట్లను పంపిణీ చేస్తే వాటిని కాపాడుకోవాల్సింది పోయి లబ్ధిదారులు దొడ్డిదారిన విక్రయిస్తున్నట్లు, మరికొన్నిచోట్ల అనారోగ్యంతో గొర్రెలు మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయని మంత్రి అసహనం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు, పత్రికలు సైతం గొర్రెల యూనిట్లలో అక్రమాలు జరుగుతున్నట్లు పేర్కొంటున్నాయని, వాస్తవికంగా జరిగే సమస్యలు తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. వాతావరణంలో వచ్చిన మార్పుల ప్రభావంగానే కొన్నిచోట్ల ఇక్కడి వాతావరణానికి తట్టుకోలేక అనారోగ్యంతో గొర్రెలు మృతి చెందుతున్నట్లు తనకు సమాచారం ఉందని అన్నారు. గొర్రెల లబ్ధిదారులు అధికారులతో సమస్యలు విన్నవించి, ఏ ఒక్క గొర్రె మృతి చెందకుండా వాటిని కాపాడుకొని ఆర్థికంగా ఎదిగే విధంగా ప్రణాళిక రూపొందించుకోవాలని మంత్రి హితబోధ చేశారు. అయితే కొందరు దళారీలు కూడా ప్రవేశించి గొర్రెల యూనిట్ల పథకాన్ని విఫలం చేసే ప్రయత్నం చేస్తున్నారని, ఈ వ్యవహారంపై విచారణ సాగించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆదేశించారు. గొల్లకుర్మ సహకార సంఘాలు సైతం ముఖ్యమంత్రి ఇచ్చిన కానుకను సద్వినియోగం చేసుకోవాలని, వైద్యసేవలు అందకపోతే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఇకపై గొర్రెల యూనిట్ల పంపిణీలో అక్రమాలకు తావులేకుండా మేలు రకం గొర్రెలతో పాటు ఒక్కోటి 20 కేజీలు తగ్గకుండా పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ మనోహర్, జడ్పీటిసి అశోక్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆరె.రాజన్న, గొల్లకుర్మ సంఘాల అధ్యక్షులు హన్మండ్లు, అడ్డిబోజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కేసముద్రం మార్కెట్లో నిధుల గోల్‌మాల్?

కేసముద్రం, అక్టోబర్ 3: మహబూబాబాద్ జిల్లాలో అతిపెద్ద వ్యవసాయ మార్కెట్‌గా గుర్తింపు పొందిన కేసముద్రం వ్యవసాయ మర్కెట్లో నిధుల గోల్‌మాల్ జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మూడు మాసాల క్రితం వరకు ఇక్కడ కార్యదర్శిగా పనిచేసిన అశోక్ ఇష్టానుసారంగా వ్యవహరించి నిధులను లెక్కా పత్రం లేకుండా ఖర్చు చేశాడని ఆరోపిస్తూ ఆయన పనిచేసిన కాలంలో ఆదాయ, వ్యయాలపై విచారణ జరపాలంటూ ఏకంగా పాలకమండలి మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులను కోరుతూ ఇటీవల నిర్వహించిన పాలకమండలి సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించడంతో నిధుల గోల్‌మాల్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. మార్కెట్ కార్యదర్శిగా అశోక్ 2016 ఏప్రిల్ మొదటి వారంలో పదవి బాధ్యతలు చేపట్టారు. ఆయన కార్యదర్శిగా విధులు చేపట్టిన తరువాత మార్కెట్లో అనేక సంస్కరణలు చేపట్టారని, మార్కెట్లో సమయపాలన మెరుగుపడిందని, హరితహారం కార్యక్రమంతో పాటు సిబ్బంది పనితీరుగాడిలో పడిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే పాలకమండలి మాత్రం ఆయన ఆ సమయంలో తమ అనుమతి లేకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించి, సిసి కెమెరాల ఏర్పాటు, కార్మికులకు దుస్తుల పంపిణీ కోసం లక్షల రూపాయలు ఇష్టానుసారంగా ఖర్చు చేశారని, నాణ్యమైన, సరైన వస్తువులు, దుస్తులు అందించలేదని ఆరోపిస్తూ ఆయన ఇక్కడ పనిచేసిన కాలంలో నిధుల వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే అశోక్ గత ఏడాది ఏప్రిల్ మొదటి వారంలో విధులు చేపట్టి, ఈ ఏడాది జూలైలో అనారోగ్యం కారణంగా డిప్యుటేషన్‌పై వెళ్లగా, కేసముద్రం మార్కెట్ పాలకమండలి గత ఏడాది అక్టోబర్ 23న నియమితులవగా, నవంబర్‌లో పదవి బాధ్యతలు చేపట్టారు. అయితే నిధులు గోల్‌మాల్ జరిగినట్లు ఆరోపిస్తున్న సమయంలో కొంత పాలకమండలి కూడా అధికారంలో ఉండటం, ఆ సమయంలో పాలకమండలి ఎందుకు అడ్డుకోలేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పాలకమండలి నియమితులైన తరువాత తొమ్మిది మాసాల పాటు అశోక్ కార్యదర్శిగా ఇక్కడ విధుల్లో ఉన్న సమయంలో గోల్‌మాల్ వ్యవహారంపై నోరెందుకు మెదపలేదని, తీరా ఆయన అనారోగ్యంతో డిప్యుటేషన్‌పై వెళ్లిన తరువాత విచారణకు డిమాండ్ చేయడం ఎంతవరకు సబబని పలువురు ప్రశ్నిస్తున్నారు. అయితే తాము మార్కెట్ పాలకమండలి బాధ్యతలు చేపట్టిన తరువాత మార్కెట్ నిర్వాహణ వ్యవహారాన్ని తెలుసుకునేందుకు ఆరుమాసాల సమయం పట్టిందని, తీరా తెలుసుకున్న తరువాత తమకు పరిస్థితి అర్థమైన తరువాత గోల్‌మాల్ విషయం తెలిసిందని పాలకమండలి సభ్యులు చెబుతున్నారు.
క్యాష్‌బుక్ మాయం...?
కాగా ప్రతి నెలా మార్కెట్ ఖర్చుల కోసం పాలకమండలి కార్యదర్శి పేరిట చెక్ జారీ చేస్తే ఆయన ఎస్టీ ద్వారా నగదు డ్రా చేసి తన మార్కెట్ కమిటీ పేర ఖాతాలో జమ చేసి చెల్లింపులు జరపడం ఆనవాయితీగా వస్తోంది. ఈ విధంగా ఎస్టీఓ నుంచి డబ్బులు డ్రా చేసిన తరువాత కార్యదర్శి అశోక్ పనిచేసిన కాలం నాటి క్యాష్ బుక్ కనిపించడం లేదనే ప్రచారం సాగుతోంది. నిధుల గోల్‌మాల్ జరిగిందనడానికి ఇదో కారణంగా పాలకమండలి సభ్యులు చెబుతున్నారు. క్యాష్‌బుక్ లభిస్తే అసలు వ్యవహారం బయటపడుతుందంటున్నారు. ఏతావతా పదిలక్షలకు పైగా నిధులు గోల్‌మాల్ జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇన్‌చార్జి కార్యదర్శి అంజిత్‌రావు వివరణ
ఈ వ్యవహారంపై ప్రస్తుత ఇన్‌చార్జి కార్యదర్శి అంజిత్‌రావును వివరణ కోరగా నిధులు గోల్‌మాల్ జరినట్లు అనుమానిస్తూ పాలకమండలి ఉన్నతాధికారుల విచారణ కోరింది వాస్తవమేనని, అయితే విచారణ ఎప్పుడు జరుగుతుందనేది ఉన్నతాధికారులు నిర్ణయిస్తారన్నారు.