తెలంగాణ

న్యాయ వ్యవస్థ, ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల అమలు కోసం విహెచ్ దీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 16: న్యాయ వ్యవస్థ (జ్యుడిష్యరీ)లో, ప్రైవేటు, పబ్లిక్ రంగాల్లో ఉద్యోగ నియమాకాల్లో ఒబిసి, ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీ రిజర్వేషన్లు అమలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఎఐసిసి నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వి. హనుమంత రావు శనివారం దీక్ష నిర్వహించారు. ఇందిరా పార్కు వద్ద ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విహెచ్ దీక్ష చేశారు. టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సిఎల్‌పి నేత, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కె. జానారెడ్డి, రాజ్యసభ సభ్యుడు ఎంఎ ఖాన్, పార్టీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, మాజీ ఎంపి మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే ఎం. కోదండరెడ్డి, పార్టీ నాయకులు జి. నిరంజన్, బొల్లు కిషన్, శ్రీకాంత్ గౌడ్, కరుణానిధి తదితరులు విహెచ్‌కు సంఘీభావంగా దీక్షలో కూర్చున్నారు. ఇలాఉండగా సాయంత్రం విహెచ్‌కు ఫారూఖ్ హుస్సేన్, కోదండరెడ్డి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా విహెచ్ ప్రసంగిస్తూ జ్యుడీష్యరీలో, ప్రైవేటు, ప్రభుత్వ రంగాల్లో రిజర్వేషన్లు తప్పకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ రంగాల్లో రిజర్వేషన్లు అమలు చేయకపోతే ఒబిసి, ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీలు వెనుకబడి పోతారని ఆయన తెలిపారు. అందుకే తాను రాబోయే పార్లమెంటు సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రధానంగా లేవదీస్తానని అన్నారు. త్వరలో తాను ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కూడా కలిసి రిజర్వేషన్ల కోసం పార్లమెంటులో పోరాటం చేసే అంశంపై చర్చిస్తానని ఆయన చెప్పారు. రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీని కూడా కలిసి వినతి ఈ మహాధర్నాలో ఆమోదించిన తీర్మానాన్ని అందజేస్తానని ఆయన తెలిపారు. అంతకు ముందు కోదండరెడ్డి రిజర్వేషన్ల అమలు కోసం ప్రతిపాదించిన తీర్మానాన్ని సభ కరతాళధ్వానాలతో ఏకగ్రీవంగా ఆమోదించింది.

చిత్రం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం దీక్ష నిర్వహిస్తున్న
ఎఐసిసి నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తదితర కాంగ్రెస్ నేతలు