తెలంగాణ

ధర్మ పోరాటం ఆగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ సికిందరాబాద్, అక్టోబర్ 5: సత్యం, ధర్మం, న్యాయం కోసం తాను చేస్తున్న పోరాటంలో వెనుకంజ వేసే ప్రసక్తే లేదని ప్రొఫెసర్ కంచ ఐలయ్య పేర్కొన్నారు. గురువారం ఐలయ్య తన 65వ జన్మదినాన్ని పురస్కరించుకుని 200 సంవత్సరాల ‘ఇండియన్ ఇంగ్లీష్ డే’ ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆంగ్లంలో మొట్టమొదటిసారిగా దేశంలో పెన్నుతో రాసిన మహాత్మా జ్యోతిరావు పూలె, సావిత్రి పూలె, దేశ గతిని మార్చిన అంబేద్కర్‌లకు తన జన్మదినం సందర్భంగా కట్ చేస్తున్న కేక్‌ను అంకితం చేస్తున్నానని ప్రొఫెసర్ కంచ ఐలయ్య ఈ సందర్భంగా తెలిపారు. దేశంలో రెండు కులాలు- బ్రాహ్మణులు, వైశ్యులను మాత్రమే మేధావులుగా వ్యవహరిస్తున్నారని, కాని అంతకు రెట్టించిన మేధావులు ఎస్సీఎస్టీల్లో ఉన్నారని ఆయన అన్నారు. వారిని ఎక్కడా వెలుగులోకి రానీయకుండా చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
హిందూత్వంలో అన్ని కులాలను సమానంగా చూడడం లేదన్నారు. గ్రామీణ ప్రాంతంలో ఆంగ్ల విద్యకోసం, దేశంలో అట్టడుగు వర్గాల వాటా కోసం పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. చావుకు భయపడే వారు దేశాన్ని మార్చలేరని, కత్తి పట్టుకున్న వాడికన్నా కలం పట్టుకున్న వాడే ఈ దేశాన్ని మార్చగలడని ఆయన పేర్కొన్నారు. ‘ఈ దేశ నిర్మాణం మాది. పాకిస్తాన్, చైనాలను ఒక అంగుళం కూడా జరగనివ్వబోం. అదే సమయంలో మా నాగరికతను, చరిత్రను ధ్వంసం చేసిన ఆర్యుల ఆటలను ఇక సాగనివ్వబోము’ అని ఆయన హెచ్చరించారు. ఈ దేశ చరిత్రకు మూలం కుండ, చెప్పు, మంగలి కత్తి అని మర్చిపోకూడదని గుర్తుచేశారు. కెసిఆర్, చంద్రబాబులు కెజి నుంచి పిజి వరకు ఉచిత విద్య కాదు, కెజి నుంచి 12వ తరగతి వరకు గ్రామీణ ప్రాంతంలో ఆంగ్ల విద్యను అందించాలని ఆయన డిమాండ్ చేశారు. దీన్ని సాధించడానికి పోరాటం చేయడానికి కూడా వెనుకాడబోమని ఐలయ్య పేర్కొన్నారు. ఇంటర్మీడియట్‌ను రద్దు చేసి చైతన్య, నారాయణ విద్యాసంస్థలను పారద్రోలాలన్నారు. దళిత బహుజనులు ఆంగ్ల విద్యను అభ్యసిస్తే రాబోయే 20 సంవత్సరాలలో అగ్రకుల మేధావులు ఎక్కడ కనిపించబోరని ఐలయ్య అన్నారు.
దేశ భద్రతలో ముందుండే సైనికుల పిల్లలకు, కానిస్టేబుళ్ల పిల్లలకు అగ్రకుల పెట్టుబడిదారుల చేతుల్లో ఉన్న సంస్థల్లో ఉద్యోగాలు కల్పించాలని ప్రొఫెసర్ ఐలయ్య డిమాండ్ చేశారు. దేశంలో వేల కోట్ల రూపాయలతో ఇళ్లు కట్టుకున్న అంబానీ సంస్థల్లో 90శాతం మంది వైశ్యులు, బ్రాహ్మణులే బోర్డు డైరెక్టర్‌లుగా ఉన్నారని పేర్కొంటూ, మిగిలిన కులాలకు అంతటి అర్హత లేదా? వారు మేధావులు కాదా? అని ఆయన ప్రశ్నించారు. దళిత బహుజనులు ఇండియన్ ఇంగ్లీష్‌లో తిరుగులేని మేధావులుగా ఎదగాలని కంచె ఐలయ్య పిలుపునిచ్చారు.

చిత్రం.. కంచ ఐలయ్య