తెలంగాణ

తెలంగాణ ప్రతిపాదనలకు.. జిఎస్‌టి మండలి ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 6: తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలను గతంలో తిరస్కరించిన జిఎస్‌టి కౌన్సిల్ ఈ రోజు వాటిని దాదాపుగా ఆమోదించటం పట్ల సంతోషంగా ఉందని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఈటల రాజేందర్ శుక్రవారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన జరిగిన జిఎస్‌టి కౌన్సిల్ సమావేశానికి హాజరైన అనంతరం విలేఖరులతో మాట్లాడారు. కోటి అంతకంటే తక్కువ టర్నోవర్ ఉన్న సంస్థలను కాంపోజిట్ పథకం పరిధిలోకి తీసుకురావాలని నేడు నిర్ణయించారని ఈటల తెలిపారు. తెలంగాణ ప్రభుత్వమే గతంలో ఈ ప్రతిపాదన చేసిందని చెప్పారు. ఇదే విధంగా కోటిన్నర అంతకంటే తక్కువ టర్నోవర్ ఉన్న సంస్థలు ఇక మీదట పన్నును ప్రతి నెలా చెల్లించే బదులు మూడు నెలలకు ఒకసారి చెల్లించే విధంగా నియమాలను సవరించాలని నిర్ణయించినట్లు మంత్రి చెప్పారు. పెట్రోలు, డీజిల్‌పై పన్ను తగ్గించే విషయం నేటి సమావేశంలో చర్చకు రాలేదంటూ పెట్రోలుపై పన్ను తగ్గించే ప్రతిపాదన ఏదీ తమ ప్రభుత్వం పరిశీలనలో లేదని ఈటల స్పష్టం చేశారు. వర్క్స్ కాంట్రాక్టులపై ఇంత క్రితం విధించిన 18 శాతం పన్నును పనె్నండు శాతానికి తగ్గించాలని నిర్ణయించినట్లు మంత్రి వెల్లడించారు. పని చేసే మనుషుల శాతం, మట్టి పని అధికంగా ఉంటే కాంట్రాక్టు పనులకు పన్ను ఐదు శాతం వరకు తగ్గే అవకాశాలున్నాయని రాజేందర్ తెలిపారు. మంచినీటి సరఫరాకు ఉపయోగించే పైపులపై విధించిన పన్నును తొలగించి గతంలో అమలులో ఉండిన పన్ను మినహాయింపు విధానాన్ని కొనసాగించాలని తాను డిమాండ్ చేసినట్లు చెప్పారు.
పనులు కొనసాగుతున్న ప్రాజెక్టులకు పన్ను మినహాయింపు ఇవ్వాలని తాను మరోసారి డిమాండ్ చేసినట్లు రాజేందర్ వెల్లడించారు. ఈ ప్రాజెక్టులకు పన్ను మినహాయింపు ఇవ్వకపోతే పనులు ఆగిపోయే ప్రమాదం ఉన్నదని ఆయన జిఎస్‌టి కౌన్సిల్‌ను హెచ్చరించారు. ఒక కోటి యాభై లక్షలు అంతకంటే తక్కువ టర్నోవర్ ఉన్న అంతర్ రాష్ట్ర వ్యాపార సంస్థలను కూడా మూడు నెలలకు పన్ను చెల్లించే విధానం పరిధిలోకి తీసుకు రావాలంటూ తానీ రోజు చేసిన ప్రతిపాదనకు ఆమోదం లభించే అవకాశాలు ఉన్నాయని ఈటల చెప్పారు. చిన్న వ్యాపారులు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే జిఎస్‌టి పట్ల వ్యతిరేకత మరింత పెరిగే అవకాశమున్నదని తాను హెచ్చరించినట్లు ఆయన తెలిపారు. జిఎస్‌టి అమలులోకి వస్తే వస్తువుల ధరలు తగ్గుతాయని ప్రజలు భావించారని, కానీ ఇప్పుడందుకు విరుద్ధంగా జరుగుతోందని, జిఎస్‌టి మూలంగా ధరలు పెరుగుతున్నందున ఈ సమస్యలపై దృష్టి పెట్టాలని తాను కేంద్ర ప్రభుత్వానికి సూచించానని రాజేందర్ చెప్పారు. తెలంగాణకు ఇంత వరకు నష్ట పరిహారం చెల్లింపు జరగలేదన్నారు. అభివృద్ధి రేటు పద్నాలుగు అంత కంటే తక్కువ ఉన్న రాష్ట్రాలకు మాత్రమే నష్ట పరిహారం చెల్లిస్తున్నారని, తెలంగాణలో వృద్ధి శాతం 22 ఉన్నందున తమకు నష్ట పరిహారం లభించలేదన్నారు. అయితే ఈ విధానం మారాలని తానీ రోజు సూచించినట్లు ఆయన వెల్లడించారు. జిఎస్‌టి వల్ల ఎంత లాభం వస్తోంది, నష్టం శాతం ఎంత, ఏ మేరకు రాష్ట్రాలకు నష్ట పరిహారం చెల్లించాలనే దానిపై పారదర్శకత ఉండాలని కేంద్రానికి అన్ని రాష్ట్రాలు సూచించాయని ఆయన చెప్పారు.