తెలంగాణ

హైదరాబాద్ అభివృద్ధికి చర్యలు తీసుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 6: అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ నగరం అభివృద్ధికి గట్టి చర్యలు తీసుకోవాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ సిఎం కె చంద్రశేఖరరావును కోరారు. నగరం ఎలాంటి దురవస్థలో ఉందో అందరికీ తెలిసిందేనని, గత దశాబ్దకాలంలో హెచ్‌ఎండిఎను వాడుకుని ఆ సంస్థను నిర్వీర్యం చేశారని, వౌలిక వసతుల కొరత, అసంపూర్తి ప్రాజెక్టులు, నిధుల లేమి, సిబ్బంది కొరత, అన్నింటికీ మించి సమర్థవంతమైన పాలనా వ్యవస్థ లేకపోవడం హెచ్‌ఎండిఎ బలహీనపడడానికి కారణమైందని అన్నారు.
హెచ్‌ఎండిఎకు అవార్డు ప్రకటించి తర్వాత దానిని వెనక్కు తీసుకునే దురవస్థ ఏర్పడిందని చెప్పారు. ఆన్‌లైన్ వ్యవస్థ ప్రవేశపెట్టినట్టు చెప్పినా అది విజయం సాధించలేదని, ఏకీకృత మాస్టర్ ప్లాన్ ప్రకటించాల్సి ఉన్నా, ఇంత వరకూ ఆ పని జరగలేదని, రింగ్ రోడ్ నిర్మాణం కూడా పూర్తికాలేదని, ఒఆర్‌ఆర్ అభివృద్ధి కారిడార్‌లో అభివృద్ధి కానరావడం లేదని, 13 శాటిలైట్ టౌన్‌షిప్‌లను ప్రకటించినా, వాటి అతీగతీ లేదని, అలాగే హెచ్‌ఎండిఎ పరిధిలోని 3000 చెరువులను రక్షించడంలో ప్రభుత్వం విఫలమైందని, అంతర్జాతీయ నగర నిర్మాణ డిజైన్, సమీకరించాల్సిన నిధుల కన్సల్టెన్సీ బాధ్యతను హెచ్‌ఎండిఎకు కాకుండా బయటి సంస్థలకు అప్పగించాలని అన్నారు. ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటేనే ఇవన్నీ సాధ్యమని పేర్కొన్నారు.