తెలంగాణ

12న అర్బన్ గ్రీన్ డే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 6: ఈ నెల 12వ తేదీ ‘అర్బన్ గ్రీన్ డే’ సందర్భంగా జిహెచ్‌ఎంసి, హెచ్‌ఎండిఏ సహా 73 స్థాని సంస్థల పరిధిలో ఒకే రోజు 5 లక్షల మొక్కలు నాటాలని నిర్ణయించినట్లు పురపాలక శాఖ తెలిపింది. సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు ప్రతి పట్టణ స్థానిక సంస్థల పరిధిలో ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉధృతంగా చేపట్టాలని పురపాలక శాఖ డైరక్టర్ శ్రీదేవి అన్ని పురపాలక సంఘాల కమిషనర్లను ఆదేశించారు. ప్రతి పురపాలక సంఘం పరిధిలో 2 నుంచి 5 వేల మొక్కలు నాటాలని చెప్పారు. ఆయా ప్రాంతాల్లోని స్థానిక సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు, స్వయం సహాయక సంఘాలు, సాధారణ ప్రజల సహకారం తీసుకుని మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని సూచించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంత చేసేందుకు గాను రోడ్ల పక్కన, పార్కుల సమీపంలో, డంప్ యార్డుల వద్ద, ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణం, నీటి వనరులు ఉన్న చోట అధికంగా మొక్కలు నాటాలని తెలిపారు.