తెలంగాణ

పదవుల పంపకం అధికారం మీదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 6: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం శనివారం (7న) గాంధీ భవన్‌లో జరగనున్నది. టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ప్రజా సమస్యలపై పార్టీ చేపట్టాల్సిన ఆందోళన కార్యక్రమాలు, పోలింగ్ బూత్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలను బలోపేతం చేసుకోవడం, బ్లాక్ స్థాయిలో ఇన్‌చార్జీల నియామకం తదితర అంశాలపై చర్చిస్తారు. అయితే ఎఐసిసి ఆఫీసు బేరర్లుగా, పిసిసి ఆఫీసు బేరర్లుగా ఎవరు ఉండాలన్న అంశాన్ని ఎఐసిసికే అప్పగిస్తూ ఏకవాక్య తీర్మానం చేసే అవకాశం ఉంది. ఈ నెల 10వ తేదీలోగా అన్ని రాష్ట్రాల నుంచి తీర్మానాలు పంపించాలని ఎఐసిసి ఇదివరకే ఆదేశించింది. తెలంగాణకు ఈ దఫా మంచి పదవులు దక్కే అవకాశం ఉందని నాయకులు ఆశిస్తున్నారు. ఎఐసిసి అధికార ప్రతినిధి, ప్రధాన కార్యదర్శి ఒక్కొక్కటి లభిస్తుందని, రెండు కార్యదర్శుల పదవులు, ఇంకా ఎఐసిసి ఆఫీసు బేరర్ పదవులు దక్కనున్నాయి. అయితే ఈ పదవులకు ఎవరెవరిని నామినేట్ చేయాలో నిర్ణయిస్తూ పంపిస్తే, పదవులు రాని వారు అసంతృప్తికి గురవుతారు కాబట్టి పేర్లు తెలియజేయకుండా ఆ నిర్ణయం మీరే తీసుకోవాల్సిందిగా కోరుతూ తీర్మానం చేసే అవకాశం ఉంది. అధిష్ఠానమే ఆరా తీసి నామినేట్ చేయడం మంచిదని సీనియర్ నాయకులు అంటున్నారు.