తెలంగాణ

అక్రమాలకు పాల్పడితే ఉద్యోగంలోంచి తీసేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 6: అంగన్ వాడీ కేంద్రాలలో అక్రమాలు జరిగితే, అంగన్ వాడీ కేంద్రాలకు సంబంధించి ఎవరైనా అవకతవకలకు పాల్పడితే వారిని వెంటనే ఉద్యోగం నుంచి తొలగించాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మంత్రి తుమ్మల మహిళా శిశు సంక్షేమంపై సమీక్షించారు. ముఖ్యంగా అంగన్ వాడీ కేంద్రాలలో అక్రమాలు జరుగుతున్న విషయం తన దృష్టికి వచ్చిందని, వాటిపై వెంటనే చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. కేవలం తూతూ మంత్రపు చర్యలు చేపట్టకుండా అక్రమాలకు పాల్పడే వారిని ఉద్యోగం నుంచి తొలగించాలని ఆదేశించారు. అంగన్‌వాడీ సరుకుల సరఫరా సక్రమంగా జరిగేలా చూడాలని సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాలను రేషనలైజేషన్ సక్రమంగా జరిగేలా చూడడంతో పాటు వాటితో ఏర్పడే ఖాళీలను వెంటనే భర్తీ చేసుకోవాలని సూచించారు. చిన్న పిల్లల దత్తతకు సంబంధించి త్వరలో ఆరుగురు సభ్యులతో స్టేట్ అడాప్షన్ రిసోర్స్ ఏజెన్సీ కమిటీని వేయనున్నట్లు ఆయన తెలిపారు. అక్టోబర్ 1న నిర్వహించాల్సిన సీనియర్ సిటజన్స్ డే వాయిదా పడడంతో దానిని ఎప్పుడు నిర్వహించాలనే విషయంతో పాటు, సీనియర్ సిటిజన్ల అవసరాలు, సౌకర్యాల కల్పనపై చర్చించేందుకు ఈ నెల 10న సమావేశం కాబోతున్నట్లు మంత్రి తుమ్మల తెలిపారు.