తెలంగాణ

విజన్-2024 డాక్యుమెంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 6: దేశంలో ధనిక రాష్ట్రాల్లో అగ్రగామిగా పేరుతెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విజన్ డాక్యుమెంట్-2024 రూపకల్పనకు శ్రీకారం చుట్టింది. ఈ డాక్యుమెంట్ రూపకల్పన, వివిధ శాఖల అభివృద్ధికి సంబంధించి ప్రణాళికను తయారు చేసే బాధ్యతను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌కు అప్పగించనున్నారు. విజన్ డాక్యుమెంట్ తయారీలో గుడ్ గవర్నెన్స్ సంస్థ నోడల్ ఏజెన్సీగా పనిచేయనుంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తొలి దశలో రాష్ట్రం ఎదుర్కొంటున్న విద్యుత్ కొరత నుంచి బయటపడింది. ప్రస్తుతం సౌర విద్యుత్ ఉత్పాదనలో దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. అలాగే ఇతర విద్యుత్ ఉత్పాదన రంగాల్లో దూసుకుపోతోంది.
మిగులు విద్యుత్‌కు చేరువలో ఉంది. సాగునీటి రంగంలో అద్భుతమైన ఫలితాలు సాధించి కోటి ఎకరాలకు సాగునీరు ఇచ్చే దిశగా పయనిస్తోంది. ఇంకా పారిశ్రామిక, ఐటి రంగాల అభివృద్ధికి, ఖాయిలాపడిన పరిశ్రమల చేయూతకు ప్రత్యేక విధానాలను రూపొందించి అమలు చేస్తోంది.
ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం సమగ్రాభివృద్ధికి ప్రత్యేక డాక్యుమెంట్‌ను రూపొందించి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయం సంబంధిత రంగాలు, ఆర్థిక, సుపరిపాలన, పరిశ్రమలు, ఐటి, వౌలిక సదుపాయాలు, ప్రాంతీయాభివృద్ధి, సామాజిక రంగాలు అంటే వైద్య, విద్య, సామాజిక సంక్షేమం, నైపుణ్యాభివృద్ధి విభాగాల్లో పూర్తి స్ధాయి అభివృద్ధికి విజన్ డాక్యుమెంట్‌లో దిశ, దశా నిర్దేశనం చేయనున్నారు. ఈ డాక్యుమెంట్ రూపకల్పనకు నిపుణులు, ఉన్నతాధికారులతో బృందాలను ఏర్పాటు చేస్తారు. బలహీనవర్గాలు, మైనార్టీల సంక్షేమానికి ఇంతవరకు అమలు చేస్తున్న వివిధ పథకాలు, వాటి ఫలాలు నిర్దేశించిన వారికి చేరుతున్నాయా లేదా అనే విషయమై కూడా చర్చ జరుగుతుంది. అవసరమైతే ఈ విధానాల్లో మార్పులు చేసే అవకాశం ఉంది. 2014లో తెలంగాణ ఏర్పాటు చేసినప్పుడు ఏ స్థితిలో ఉంది, మూడేళ్ల తర్వాత ప్రస్తుత పరిస్థితి, వచ్చే ఏడేళ్లలో సాధించాల్సిన అంశాలపై విజన్ డాక్యుమెంట్‌లో స్పష్టత ఇవ్వనున్నారు.