తెలంగాణ

దొరను కాదు.. గడీ లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 6: ఈ మధ్య కాలంలో కొందరు పనిగట్టుకుని ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి రాతలు రాస్తున్నారని, అలా రాసే వారిపై కేసులు పెట్టి చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు హెచ్చరించారు. కెసిఆర్ దొర అంటూ ఓ కొత్త ట్యాగ్ తగిలించి అదే పనిగా సోషల్ మీడియాలో కొందరు చిల్లర గ్యాంగ్ విష ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి మండిపడ్డారు. ‘కెసిఆర్ దొర కాదు. దొర అనేది ఒక క్యాస్ట్ కాదు. కల్ట్ మాత్రమే’ అని సిఎం అన్నారు. తాను దొర కాదని, తనకేమీ గడి లేదన్నారు. ఇప్పుడు ఎవరైనా దొర ఉన్నారంటే ఆయన ఉత్తమ్‌కుమార్ రెడ్డేనని అన్నారు. సూర్యాపేట జిల్లా తాటిపాములలో, అలాగే హైదరాబాద్‌లో ఆయనకు గడిలాంటి ఇల్లు ఉందన్నారు.
ముఖ్యమంత్రిని, మంత్రులను, ఇతర ప్రజాప్రతినిధులను ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా, వారిపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా సహించేది లేదని కెసిఆర్ హెచ్చరించారు. హైదరాబాద్‌ను డల్లాస్ చేస్తామన్నారని, డల్లాస్ ఇలాగే ఉంటుందా? అని కొందరు వెకిలిగా మాట్లాడుతున్నారని కెసిఆర్ మండిపడ్డారు. వర్షం పడితే ఎక్కడైనా ఇబ్బందులు తప్పవు, అలాగని వర్షం పడి రోడ్లు పాడైతే కూడా తమ తప్పేనన్నట్టు విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఏమి అమెరికాలో వర్షం పడటం లేదా, బెంగళూరు, చెన్నైలో వర్షం పడటం వల్ల ఇబ్బందులు కలగటం లేదా అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. బంగారు తెలంగాణ ఏమైందని మరికొందరు సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారు. బంగారు తెలంగాణ దిశగా పని చేస్తామన్నాం కానీ ఈ మూడేళ్లలోనే బంగారు తెలంగాణగా మారుతుందా? అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.
ఈ కెసిఆర్ దొర కాదు, ఓ రైతు బిడ్డ మాత్రమేనన్నారు. రాష్ట్రంలో తమది అతి సూక్ష్మ సంఖ్యలో జనాభా ఉన్న కులం మాత్రమేనన్నారు. రాష్ట్రంలో 1.4 శాతం మంది మాత్రమే ఉన్నవారు ప్రభుత్వాన్ని నడుపుతున్నారని కొందరు మాట్లాడుతున్నారని పేర్కొంటూ కులానికి అధికారంలోకి రావడానికి సంబంధం ఏమిటని ప్రశ్నించారు. కులం వల్ల రాజకీయాల్లో రాణించలేరని, దానికి ప్రతిభ ఉండాలన్నారు. విమర్శించే వాళ్లు ఒకటి గ్రహించాలి, అతి సూక్ష్మ సంఖ్యలో ఉన్న కులం వాడే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని గుర్తు పెట్టుకోవాలన్నారు.