తెలంగాణ

కోదండరామ్ ఒక బుటాచోర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 6: ‘కోదండరామ్ ఒక బుటా చోర్, రాజకీయ బీమార్ పట్టుకుంది. తనను తాను ఎక్కువ ఉహించుకుంటున్నాడు. బండి కింద కుక్క కూడా ఈయనలాగే బండిని తానే నడిపిస్తున్నట్టు భ్రమపడుతుంది. జెఎసిగా పేరు పెట్టిందేనేను. దానికి కోదండరామ్‌ను పెట్టిందీ కూడా నేనే. తెలంగాణే వచ్చాక ఇంకెక్కడి జెఎసి, అందులో ఎవరున్నారు?. నలుగురు చిల్లరగాళ్లను వెంటేసుకొని అర్థం, పర్థం తలతోక లేకుండా మాట్లాడానికి ఆయనెవ్వరూ? ఏమి హక్కు ఉంది?’ అని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రగతి భవన్‌లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో కోదండరామ్‌పై ముఖ్యమంత్రి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘సింగరేణిలో టిఆర్‌ఎస్ గెలిస్తే సింగరేణి నాశనం అవుతుందని కోదండరామ్ పిలుపు ఇచ్చాడని మీడియా కూడా రాసింది. పిలుపు ఇవ్వడానికీ ఆయనేమైనా మహాత్మగాంధా? జాతీయ నాయకుడా? జీవితంలో కనీసం సర్పంచ్‌గానైనా గెలిచిండా?’అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.
‘కోదండరామ్ పిలుపు అని రాయకండి ఫ్లీజు, అలా రాయడం వల్ల ఆయనేదో పెద్ద నాయకుడినని అనుకుంటున్నారు’ అని సూచించారు. ‘కోదండరామ్‌కు రాజకీయ గుల ఉంది. దొంగచాటు రాజకీయాలేందుకు? గుల ఉంటే పార్టీ పెట్టు, పోటీ చేయి అంతే కానీ లంగ పనులు వద్దు’ అని ముఖ్యమంత్రి సూచించారు. ‘పార్టీ పెట్టడమంటే పాన్ డబ్బా పెట్టినంత ఈజీ కాదు. ఎన్టీయర్ పార్టీ పెట్టాడంటే దానికో నేపథ్యం ఉంది, పైగా మూడు తరాల అభిమానాన్ని సంపాదించిన నటుడు కావడం వల్ల పార్టీ హిట్ అయింది. చిరంజీవి కూడా పార్టీ పెట్టాడు ఏమైంది? కట్టెలమోపు కిందేసినట్టు వేసి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకోలేదా?’ అని కెసిఆర్ అన్నారు. మంత్రిని కావడానికి తనకే 13 ఏళ్లు పట్టిందని గుర్తు చేశారు. అమరుల స్ఫూర్తి యాత్ర అని కోదండరామ్ ర్యాలీ పెడితే కనీసం ఐదువందల మందైనా వచ్చారా? అని ప్రశ్నించారు. అమరులపై చిత్తశుద్ధి ఉంటే మలి దశ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి తల్లికి టికెట్ ఇస్తే గెలిపించమని కోదండరామ్ ప్రచారం ఎందుకు చేయలేదని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ఈ కోదండరామ్‌కు మొదటి నుంచి టిఆర్‌ఎస్ అధికారంలోకి రావద్దని బలంగా ఉందన్నారు. ఢిల్లీ యాత్రల పేరిట దొంగ యాత్రలు చేసి సోనియాగాంధీ, దిగ్విజయ్‌సింగ్‌ను కలిసి టిఆర్‌ఎస్‌తో పొత్తు వద్దు, కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసినా గెలుస్తుందని తప్పుదోవ పట్టించిందీ ఈయనేనని కెసిఆర్ ఆరోపించారు. కోదండరామ్ మాటలు పట్టుకొనే కాంగ్రెస్ నాశనం అయింది, లేకపోతే మాతో పొత్తుకొని హాయ్‌గా ఉండేవారన్నారు. కాంగ్రెస్‌కు ఎన్నికల మ్యాన్‌ఫెస్టో కూడా రాసారు, కత్తివెంకటస్వామి, అద్దంకి దయాకర్‌కు కూడా ఆ పార్టీ టిక్కెట్టు ఇప్పించిందీ కోదండరామేనని ముఖ్యమంత్రి అన్నారు.