తెలంగాణ

బిజెపి మద్దతు లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 7: భారతీయ జనతా పార్టీ మద్దతు లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని బిజెఎల్పీ నేత జి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం నాడు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ తెలంగాణ మేమే తెచ్చామని కెసిఆర్ మాట్లాడుతున్నారని, అది సరికాదని అన్నారు. తెలంగాణ ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ తాత్సారం చేస్తుంటే పార్లమెంటులో సుష్మా స్వరాజ్ గట్టిగా మాట్లాడారని కిషన్‌రెడ్డి గుర్తుచేశారు. అంతేగాక ప్రత్యక్ష పోరాటానికి కూడా బిజెపి దిగిందని , పార్లమెంటును ముట్టడి చేశామని , ఢిల్లీలో తెలంగాణ కోసం లాఠీఛార్జీ దెబ్బలు తిన్నామని, ఢిల్లీ కోర్టుల్లో బిజెపి నేతలపై కేసులు కొనసాగుతున్నాయని మరిచిపోవద్దని అన్నారు. లోక్‌సభలో బిల్లు పాసైన తర్వాత రాజ్యసభలో అమలుకు కుట్రలు జరుగుతున్నాయని తెలిస్తే స్వయంగా రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో కేంద్ర పార్టీ నాయకులు వద్దని విజ్ఞప్తి చేసినా, బిల్లు పాస్ కావాలని నాలుగు రోజుల పాటు ఆంధ్రాభవన్‌లో ఉపవాస దీక్ష చేసి ప్రభుత్వంపై వత్తిడి తెచ్చామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా కులాల ప్రస్తావన తేవడం ఆయనకు తగదని చెప్పారు. విద్యార్థులు, కార్మికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు పోరాటం చేస్తే తెలంగాణ సిద్ధించిందని, 1200 మంది బలిదానాలను కెసిఆర్ తక్కువ చేసి చూపుతున్నారని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. మిలియన్ మార్చ్, సాగర హారంలో కెసిఆర్ పాల్గొనలేదని, రైలు రోకోలో పాల్గొనలేదని, తామంతా వాటిలో పాల్గొన్నామని, కెసిఆర్ ఒంటెద్దు పోకడలతో ఉద్యమం నీరుకారిపోతుంటే కోదండరాం నేతృత్వంలోని జెఎసి ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లిందని కిషన్‌రెడ్డి అన్నారు. ఉద్యమం మొత్తాన్ని తనకు ఆపాదించుకుంటూ సిఎం చెప్పుకుంటూ ప్రజలను తప్పుదారిపట్టిస్తున్నారని చెప్పారు.