తెలంగాణ

విశ్వాసానికి ప్రతీక కోదండరామ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 7: విశ్వాసానికి ప్రతీక కోదండరాం అయితే విశ్వాసఘాతుకానికి పెట్టింది పేరు కెసిఆర్ అని టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఆరోపించారు.సింగరేణి ఎన్నికల ఫలితాలపై సిఎం కెసిఆర్ మాట్లాడుతూ ప్రతిపక్షాలు, కోదండరాంపైనా చేసిన వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో నిప్పులు చెరిగారు. మహాత్మాగాంధీ ఏ ఎన్నికల్లో గెలిస్తే ఆయన జాతిపిత అయ్యారు, మహాత్మాగాంధీ దేశానికి స్వాతంత్రం తెచ్చారు, అయితే ఆయన సర్పంచ్ అయ్యారా..? కాస్త సోయ ఉండి మాట్లాడాలని కెసిఆర్‌కు ఘాటుగా సమాధానం చెప్పారు. కోదండరాం అంత చిన్నవాడైతే అంత గొంతుచించుకుని గగ్గోలు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని అన్నారు. టిఆర్‌ఎస్‌కు అంత ప్రతాపమే ఉంటే తెలంగాణ రాష్ట్ర సాధనకు టిజెఏసిని ఎందుకు పెట్టాల్సి వచ్చింది..? కెసిఆర్ ముఖం ఢిల్లీలో చెల్లకనే రాజకీయ జెఏసికి చైర్మన్‌గా ఆ రోజు కోదండరాంను చేశావన్న సంగతి మర్చిపోయి నోటికొచ్చినట్లు మాట్లాడతావా అంటూ సిఎం కెసిఆర్‌పై ధ్వజమెత్తారు. ఉస్మానియా విద్యార్థుల త్యాగాల వల్ల తెలంగాణ ఉద్యమంలో కదలిక వచ్చి డిసెంబర్ 9 ప్రకటన వచ్చింది తప్ప నీ టిఆర్‌ఎస్ వల్ల కాదన్న సంగతి తెలంగాణ ప్రజలకు తెలియదా..? అని ప్రశ్నించారు. తెలంగాణలో టిడిపి లేదన్న కెసిఆర్‌కు భూపాలపల్లి మత్స్యకారుల సంఘం ఎన్నికలు, వర్ధన్నపేట స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏం జరిగిందో తెలీదా, హైదరాబాద్, రంగారెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి, బిజెపి అభ్యర్థి గెలిచిన సంగతి మర్చిపోయావా అని అన్నారు.