తెలంగాణ

నకిలీ విదేశీ మద్యం ముఠా అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ నార్సింగి, అక్టోబర్ 7: నకిలీ విదేశీ మద్యం సరఫరా చేస్తున్న ఓ ముఠాను తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ టాస్క్ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. శనివారం మద్యాహ్నం తెలంగాణ ఎక్సైజ్ శాఖ ప్రధాన కార్యాలయంలో విలేకర్లుకు కమిషనర్ చంద్రవదన్ వివరాలను వెల్లడించారు. గుజరాత్ రాష్ట్రానికి చెందిన బి.వి.రమణ కుమారుడు బి.శరత్, అంబావి కుమారుడు మహేష్ అంబావి రవారియా గత కొంత కాలంగా నగరంలోని అమీర్‌పేట ప్రాంతంలోని నాగార్జున నగర్ కాలనీలో ఉంటున్నారు. రాజమండ్రి పుల్లేటికూర ప్రాంతానికి చెందిన నారాయణ రావు కుమారుడు శ్రీనివాస్ నగరంలోని సనత్‌నగర్‌లో ఉంటున్నాడు. ధూల్‌పేట నివాసి హరిష్ సింగ్ వీరు అందరు గత కొంత కాలంగా మిత్రులు. పక్కా సమాచారం మేరకు తెలంగాణ ఎక్సైజ్ శాఖ టాస్క్ ఫోర్క్ బృందం నగరంలో పలు ప్రాంతాలలో నకిలీ విదేశీ మద్యం సరఫరా చేస్తున్న ఓ ముఠా వివారాలను సేకరించారు. ఈ క్రమంలో వారిని పక్కా సమాచారంతో శరత్ ఇంట్లో ఎక్సైజ్ శాఖ టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించగా 142 నకిలీ రాయల్ సెల్యూట్, బ్లూలేబుల్, గ్లెస్ లెవిట్ (15సంవత్సరాలు), గ్లెస్ ఫెడిచ్, డబుల్ బ్లాక్ విదేశీ మద్యం బాటిళ్ల లభించాయి. అయితే ఈ విదేశీ ఖాళీ బాటిళ్లను మహారాష్ట్ర ముంబాయి నగరంలోని 5స్టార్ హోటల్స్ నుంచి తెచ్చి అందులో మన ప్రాంతంలో తయారైన ఐబి, రాయల్‌స్టాక్, టీచర్ చైయిస్ తదితర మద్యం ఆ విదేశీ ఖాళీ బాటిళ్లలో నింపి మళ్లీ ఏదావిధంగా సీల్ వెసేవారు. విదేశీ బాటిళ్లకు సీల్ కూడా ఎవ్వరికి అనుమానం రాకుండా వేసేవారు. ఈ బాటిళ్లను నగరంలోని జూబ్లీహిల్స్, మాదాపూర్, అమీర్‌పేట్ తదితర ప్రాంతాలలో జరుగుతున్న ఈవెంట్ పర్మిట్స్‌లకు సరఫరా చేసేవారు. అయితే ఒక్కోక్క సీసాలో కేవలం మూడు నాలుగు వందల రూపాయల విలువ చేసే మద్యం పోసి, వివిధ దేశాలకు చెందిన విదేశీ బాటిల్ పేరు చెప్పి వినియోగదారుల వద్ద 20నుంచి 30వేల రూపాయాల వరకు వసూలు చేసేవారు. ఎక్సైజ్ శాఖ టాస్క్ఫోర్స్ పోలీసులు పక్కా సమాచారంతో ఈ ముఠా సభ్యులను పట్టుకున్నాట్లు తెలిపారు. అంతేకాకుండా దూల్‌పేట్‌కు చెందిన హరిష్‌సింగ్ పరారీలో ఉన్నాట్లు పేర్కొన్నారు. సింగ్‌ను కూడా మరో రెండు మూడు రోజుల్లో పట్టుకుంటామన్నారు. నకిలీ విదేశీ మద్యం పట్టుకున్న బాటీళ్ల 142 కాగా, వాటి విలువ సుమారు 14లక్షల వరకు ఉంటుందని కమిషనర్ తెలిపారు.నగరంలో విదేశీ మద్యం అంటు పోసపోకుండా అన్ని మద్యం షాపుల్లో లభించే విధంగా తము ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ విదేశీ మద్యం సీసాలకు కూడా తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఏర్పాటు చేసిన త్రీడి ఆలోగ్రాఫ్‌ను కూడా పెట్టిన దానిని, నిజమైన విదేశీ మద్యమని గుర్తించ వచ్చన్నారు. ఈ క్రమంలో ఏవరైన విదేశీ బాటిళ్ల అమ్ముతున్నట్లు సమాచారం వస్తే వెంటనే ఎక్సైజ్ శాఖ టోల్ ఫ్రీ నెంబర్ 18004252523కు తెలియచేయవలసిందిగా కోరారు. ఈ దాడిలో ఏఇఎస్ కె. పవన్‌కుమార్, ఇన్స్‌పెక్టర్ ప్రవీణ్‌కుమార్, ఎస్‌ఐ. లింగయ్య, ఎంఏ. సుతారితో పాటు సిబ్బందిని అభినందించారు.

చిత్రం..వివరాలను తెలుపుతున్న ఎక్సైజ్ శాఖ కమిషనర్ చంద్రవదన్ తదితరులు