తెలంగాణ

పోరుబాటతో నిర్లక్ష్య పాలనకు చరమగీతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోటకొండూరు, అక్టోబర్ 7: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య పాలనను ఎండగడుతూ, ప్రజల సమస్యలను పరిష్కరించేందుకే పోరుబాట నిర్వహిస్తున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. సామాజిక తెలంగాణ, సమగ్రాభివృద్ధికి సిపిఐ చేపట్టిన పల్లెపల్లెకు పోరుబాట కార్యక్రమం శనివారం మండల కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఏ ఒక్కరి వల్ల రాలేదని, రాష్ట్ర ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థులు, అన్ని రాజకీయ పార్టీల ఉద్యమాల ఫలితంగా రాష్ట్రం సిద్ధించిందన్నారు. ఉద్యమంలో కీలక భూమిక పోషించిన వారిపై అసభ్య పదజాలంతో దూషించడం టిఆర్‌ఎస్ విషసంస్కృతికి నిదర్శనమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకొనే బంగారు తెలంగాణ కాదని, నేడు బతుకు, సామాజిక తెలంగాణ అవసరమన్నారు. రాష్ట్ర ప్రజలు తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాలు జరుగుతాయని ఆశిస్తే వాటి అమలులో ప్రభుత్వం మాటల గారడీ, ప్రకటనలకే పరిమితమైందన్నారు. రాష్ట్రంలో రైతన్నల బతుకులు చితికిపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మంలో అన్నం పెట్టే రైతన్నల చేతులకు సంకెళ్లు వేసిన ఘనత టిఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. ప్రజా ఉద్యమాల ద్వారా సాధించుకున్న తెలంగాణలో నేడు అప్రజాస్వామికంగా ధర్నా చౌక్‌ను ఎత్తివేసి ప్రజాభిప్రాయాలను, సమస్యలను వ్యక్తపర్చకుండా ఉద్యమాలను అణచివేస్తూ ఉద్యమకారులు, ప్రజలపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. సామాజిక తెలంగాణ కోసం ఐక్య ఉద్యమాలు చేపడతామన్నారు. అనంతరం స్థానిక సమస్యలపై స్పందిస్తూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 24 గంటల వైద్య సేవలు అందించాలన్నారు. వంగపల్లి హైవేపై అండర్‌పాస్ బ్రిడ్జిని ఏర్పాటుచేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తొలుత మండల కేంద్రానికి చేరుకున్న పోరుబాట బస్సు యాత్రకు సిపిఐ, కాంగ్రెస్, సిపిఎం, టిడిపి కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎస్.బాలమల్లేష్, పశ్య పద్మ, మహ్మద్ యూసుఫ్, ఉస్తెల సృజన, పాండురంగాచారి, రాములు యాదవ్, రమావత్ అంజయ్యనాయక్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..నల్లగొండ జిల్లా మోటకొండూరు గ్రామంలో జరిగిన సభలో ప్రసంగిస్తున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి