తెలంగాణ

ఉప ఎన్నిక వస్తే గెలుపు కాంగ్రెస్‌దే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, అక్టోబర్ 7: ఉద్యమాల గడ్డ నల్లగొండ ప్రజలు చైతన్యవంతులని, టిఆర్‌ఎస్ మూడేళ్ల పాలనపై వారిలో తీవ్ర అసంతృప్తి ఉందని నల్లగొండ పార్లమెంటుకు ఉప ఎన్నిక వస్తే ఆ పార్టీకి గుణపాఠం చెప్పేందుకు వారంతా సిద్ధంగా ఉన్నారని సిఎల్పీ ఉప నేత, నల్లగొండ శాసనసభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో విలేఖరులతో మాట్లాడిన కోమటిరెడ్డి సింగరేణి కార్మిక సంఘాల గెలుపుతో తన పాలనంతా బాగుందని భ్రమించి సిఎం కెసిఆర్ నల్లగొండ ఉప ఎన్నికకు సిద్ధపడితే ఎదురుదెబ్బ తప్పదన్నారు. నల్లగొండ పార్లమెంటు స్థానం గత ఎన్నికల్లో రెండు లక్షల మెజార్టీతో కాంగ్రెస్ గెలిచిందన్నారు. సాగర్, హుజూర్‌నగర్, కోదాడలలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జానారెడ్డి, ఉత్తమ్, పద్మావతి ఉన్నారని, నల్లగొండలో తానున్నానని, దేవరకొండ, మిర్యాలగూడలలో ప్రస్తుతం టిఆర్‌ఎస్‌లో చేరిన భాస్కర్‌రావు కాంగ్రెస్ నుండి, రవీంద్రకుమార్ కాంగ్రెస్ మద్దతుతో గత ఎన్నికల్లో గెలిచారన్న సంగతి గుర్తుంచుకోవాలన్నారు. ఎంపి గుత్తాతో పాటు మిర్యాలగూడ, దేవరకొండ ఎమ్మెల్యేలు పార్టీలు మారినా ప్రజలు కాంగ్రెస్ వెంటే ఉన్నారని ఒకవేళ నల్లగొండ పార్లమెంట్ సీటుకు ఉప ఎన్నిక వస్తే కాంగ్రెస్ భారీ మెజార్టీతో గెలుస్తుందన్నారు. గత ఎన్నికల్లో గుత్తా సుఖేందర్‌రెడ్డికి కాకుండా కాంగ్రెస్ చేయిగుర్తుకు ప్రజలు ఓటు వేశారన్నారు. సూర్యాపేట సెగ్మెంట్‌లోనూ కాంగ్రెస్ బలంగా ఉందన్నారు. నల్లగొండ ఉప ఎన్నికల్లో టిఆర్‌ఎస్ గెలుస్తుందన్న సర్వేలు వాస్తవం కాబోవని, స్థానిక సంస్థల ఎమ్మెల్సీలో కాంగ్రెస్ టిఆర్‌ఎస్‌ను ఓడించినట్లుగానే ఈ ఉప ఎన్నికల్లోనూ గెలుస్తామన్నారు. సోనియా, రాహుల్‌గాంధీ కాంగ్రెస్ నుండి ఎవరిని పోటీ పెట్టినా గెలుపు త థ్యమని తమ సోదరుల్లో ఎవరికి టికెట్ ఇచ్చినా భారీ మెజార్టీతో గెలుస్తామన్నారు. రాచరికం తరహాలో కులాల కెసిఆర్ కులాల వారీగా భవనాలు నిర్మిస్తున్నారని, ఆ భవనాలతో ప్రజల జీవితాల్లో మార్పు రాదన్నారు. టి.జెఎసి చైర్మన్ కోదండరామ్‌ను పరుషంగా దూషించిన కెసిఆర్ తీరు అభ్యంతరకమన్నారు. కోదండరామ్ పట్ల కెసిఆర్‌లో ఉన్న ఆందోళనకు ఆయన తిట్లు అద్దం పడుతున్నాయని అన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే లింగయ్య, డిసిసిబి చైర్మన్ సంపత్‌రెడ్డి తదితరులు ఉన్నారు.