తెలంగాణ

జోనల్ వ్యవస్థపై అఖిలపక్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 8: విద్యార్థులు, యువకుల జీవితాలను ప్రభావితం చేసే జోనల్ వ్యవస్థపై ఇష్టానుసారం ప్రకటనలు చేయకుండా తక్షణమే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి సలహాలు, సూచనలు తీసుకోవాలని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ నేపథ్యంలో రాష్ట్రంలో జోన్లను కూడా పెంచాలని గతంలో పలు పర్యాయాలు రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, మేధావులు సూచించినప్పటికీ పెడచెవిన పెట్టిన ముఖ్యమంత్రి కెసిఆర్ జోనల్ వ్యవస్థను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జోనల్ వ్యవస్థకు సంబంధించిన రాష్టప్రతి ఉత్తర్వులు అవసరం అవుతాయని తాము చెప్పినా వినిపించుకోకుండా నియంతృత్వ ధోరణితో నిర్ణయం తీసుకున్నారని ఆయన తెలిపారు. ఇప్పుడు మళ్లీ జోన్లు పెంచుతామంటూ అదేతరహా ఏకపక్ష ధోరణితో మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. ఏ మాత్రం విజ్ఞత లేని ఈ వ్యవహార శైలి దొరతనం కాక ఇంకేమిటీ? అని ఆయన ప్రశ్నించారు. ఎంతో సున్నితమైన ఈ అంశంపై ఆచితూచి వ్యవహరించకుండా విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడడం భావ్యం కాదన్నారు. కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత కనీసం ఐదు జోన్లయినా విభజించాలన్నది సిపిఐ అభిప్రాయమని ఆయన తెలిపారు. పాత జిల్లాల ఆధారంగా హైదరాబాద్, మహబూబ్‌నగర్-మెదక్-రంగారెడ్డి, నల్లగొండ-ఖమ్మం, వరంగల్-కరీంనగర్, ఆదిలాబాద్-నిజామాబాద్‌లను ఐదు జోన్లుగా ఏర్పాటు చేయాలని చాడ సూచించారు.