తెలంగాణ

ఐలయ్య ఇంటి వద్ద భారీ బందోబస్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 8: ప్రొఫెసర్ కంచ ఐలయ్య ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కంచ ఐలయ్య రచించిన ‘సామాజిక స్మగ్లర్లు-కోమటోళ్లు’ అనే పుస్తకంపై చర్చిస్తామంటూ ఆదివారం ఆర్యవైశ్య సంఘాలు ఐలయ్య ఇంటిని ముట్టడించేందుకు యత్నించాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఐలయ్య ఇంటి వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. అదే క్రమంలో ఐలయ్య మద్దతుదారులు కూడా భారీ సంఖ్యలోనే తరలివచ్చారు. దీంతో తార్నాకలోని ఐలయ్య ఇంటి పరసరార్లో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. కోమటోళ్లపై రాసిన పుస్తకం దేశవ్యాప్తంగా దుమారం లేపింది. ఈ పుస్తకంలో కంచ ఐలయ్య ఆర్యవైశ్యుల మనోభావాలను కించపరిచారని వైశ్యసంఘాలు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో సైతం ఐలయ్య పుస్తకంపై తీవ్ర స్థాయిలో ఆర్యవైశ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తనను చంపుతామని ఫోన్ ద్వారా బెదిరిస్తున్నారని ఐలయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన ఓ సభలో ఐలయ్య అవేశంగా ప్రంసగించారు. ఇవాళ పెద్ద కులాన్ని నేను ఏమో అన్నానని, ఆర్యవైశ్యులు ధనం ఉన్నదని విర్రవీగుతున్నారు..డబ్బుకు ధనానికి ఐలయ్య భయపడడు..మీ అధికారానికి ఐలయ్య తలవంచడు.. వచ్చే ఎన్నికల నాటికి నారాయణ, శ్రీ చైతన్య తట్టబుట్ట సర్దుకోవాలి అని ఐలయ్య హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఆర్యవైశ్య సంఘాలు ఐలయ్య ఇంటిని ముట్టడించేందుకు యత్నిస్తున్నారని సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అదే క్రమంలో ఐలయ్య మద్దతుదారులు కూడా చేరుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ముందు జాగ్రత్త చర్యగా పలువురిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు.