తెలంగాణ

ప్రాథమిక సేవగా బ్రాడ్‌బ్యాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 8: బ్రాడ్ బ్యాండ్‌ను ప్రాథమిక వినియోగ సేవగా గుర్తించాలని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్ కేంద్ర సమాచార మంత్రి మనోజ్‌సిన్హాకు లేఖ రాశారు. ఇంటింటికి ఇంటర్నెట్ ద్వారా టివి, టెలిఫోన్, ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు సహకరించాలని అన్నారు. 3జి, 4జి ద్వారా టెలిఫోనిక్ ఇంటర్నెట్ సేవల వేగం పెరిగినా, బ్రాడ్ బ్యాండ్ సేవలకు మరింత డిమాండ్ పెరుగుతుందని ఆ లేఖలో మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం చేసిన చట్టం, తెలంగాణ ఫైబర్‌గ్రిడ్ కార్పొరేషన్ గురించి లేఖలో మంత్రి ప్రస్తావించారు. నూతనంగా నిర్మించే భవనాలకు ఇంటర్నెట్ డక్ట్ ఉండాలని టెలికం కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. బ్రాడ్‌బ్యాండ్ సేవల విస్తృతి ఎంత పెంచితే ఆ స్థాయిలో దేశ స్థూల జాతీయోత్పత్తి పెరుగుతుందని ఐరాస సైతం సూచించిందని తెలిపారు. గడచిన 20 ఏళ్లలో గ్రామాల్లో మొబైల్ సేవల వినియోగం పెరిగిందని, అయితే బ్రాడ్‌బ్యాండ్ సేవల విషయంలో మాత్రం ఎక్కువ మంది వినియోగదారులును ఆకట్టుకోలేకపోయిన విషయాన్ని మంత్రి వెల్లడించారు. టెలిఫోన్ ద్వారా ఇంటర్నెట్ అందించే వైర్‌లెస్ ఇంటర్నెట్ సేవలు 3జి, 4జి సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో అనేక రెట్లు పెరిగినప్పటికీ హై స్పీడ్ బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ కోసం కూడా డిమాండ్ పెరుగుతూనే ఉందని కేంద్రమంత్రి దృష్టికి తెచ్చారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన భారత్ నెట్ కార్యక్రమాన్ని అభినందించిన మంత్రి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి మిషన్ భగీరథకు అనుసంధానం చేసినట్లు ఆయన వెల్లడించారు. నూతనంగా నిర్మించబోయే ప్రతి భవనానికి ఇంటర్నెట్ డక్ట్ కలిగి ఉండాలన్న ట్రాయ్ సూచనల మేరకు అన్ని రాష్ట్రాల పురపాలక సంఘాలకు తగిన ఆదేశాలు జారీ చేయాలని మంత్రి సూచించారు. బ్రాడ్‌బ్యాండ్ ఉన్న భవనాలకు మాత్రమే ఆక్యుపెన్సీ సర్ట్ఫికెట్లు జారీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.