తెలంగాణ

నేటినుంచి లారీల సమ్మె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, అక్టోబర్ 8: లారీల సమ్మెలో అత్యవసర సరుకుల రవాణాను మినహాయిస్తున్నామని నేడు, రేపు రెండు రోజులపాటు జరిగే లారీల సమ్మెకు ప్రజలు కూడా సహకరించాలని తెలంగాణ రాష్ట్ర లారీ ఓనర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం మహబూబ్‌నగర్‌లో జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులతో కలిసి ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రెండు రోజుల పాటు లారీల సమ్మె చేయబోతున్నామని తెలిపారు. కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వాలున్నా లారీల యాజమానులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో విఫలమవుతున్నాయని, అందుకే సమ్మెకు దిగక తప్పడం లేదని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం మొత్తం లక్షాయాబై వేలకు పైగా లారీలు ఉన్నాయని, అన్ని లారీలు సమ్మెలో పాల్గొంటాయని తెలిపారు. అయితే కొన్ని అత్యవసర సరుకుల రవాణాకు మాత్రం మినహాయింపు ఇస్తున్నామని తెలిపారు. మొదటి నుండి లారీ ఓనర్స్ చేస్తున్న డిమాండ్లపై వివక్షత చూపుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో లారీలు అంటేనే ఓ కుటీర పరిశ్రమ అని వీటిని పట్టించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.
సింగిల్ పర్మిట్ విధానం తీసుకురావాలంటూ తాము డిమాండ్ చేస్తుంటే తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మాత్రం అందుకు సిద్ధంగా ఉన్నారని, ఫైల్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిపారు. కాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ఇంతవరకు దానిపై ఎలాంటి స్పందన లేదని అన్నారు. తెలంగాణ లారీలు ఆంధ్రకు వెళ్తే ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారని ఐదు వేలు చెల్లిస్తే సింగిల్ పర్మిట్ వస్తుందని అందుకు అనుగుణంగా చంద్రబాబు నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నెలాఖరులో తెలంగాణ, ఆంధ్ర సరిహద్దు కోదాడ దగ్గర లక్షమంది లారీ ఓనర్స్‌తోపాటు డ్రైవర్లు, క్లీనర్లు, వాటిపై ఆధారపడి బతుకుతున్న వారితో కలిసి ధర్నాకు దిగుతామని అందుకు బాధ్యుడు చంద్రబాబునేనని ఆరోపించారు.
ఈ నెల 9, 10వ తేదీలలో జరిగే లారీల సమ్మెను విజయవంతం చేయాలని ఆయన కోరారు. అక్రమంగా ఆంధ్రకు సంబంధించిన బస్సులు ఇప్పటికీ తెలంగాణలో తిరుగుతూనే ఉన్నాయని వాటిపై కూడా త్వరలోనే ఓ కార్యాచరణ రూపొందిస్తామని హెచ్చరించారు. విలేఖరుల సమావేశంలో జిల్లా లారీ అసోసియేషన్ నాయకులు ఆశోక్‌గౌడ్, బాబు, అన్వర్‌పాష, నజీర్, మహిమూద్ పాష, సలాం తదితరులు పాల్గొన్నారు.