తెలంగాణ

కోర్టులకు మరింత భద్రత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 8: దేశంలో అన్ని న్యాయస్థానాల వద్ద భద్రత పెంచాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో కేంద్ర హోంశాఖ అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాలు తమ పరిధిలో కోర్టుల వద్ద తగిన పోలీసు భద్రత, నిఘా పెంచాలని కేంద్ర హోంశాఖ కోరింది. ఇటీవల ఒక కోర్టు వద్ద ఒక సాక్షిని ప్రత్యర్థులు హత్య చేశారు. దీంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎస్‌ఏ బోబ్డో, జస్టిస్ ఎల్ నాగేశ్వరరావుతో కూడిన ధర్మాసనం కోర్టుల వద్ద భద్రతకు తీసుకుంటున్న చర్యలపై నాలుగు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. కేంద్ర పారిశ్రామిక భద్రత బలగాలు లేదా ఇతర పోలీసు బలగాలతో భద్రత ఏర్పాటు చేయాలని కోర్టు కోరింది. దీనికి సంబంధించి మార్గదర్శకాలను జారీ చేయాలని, కోర్టుకు వచ్చే సాక్షులకు కూడా భద్రత కల్పించేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించాలని సుప్రీం కోర్టు కేంద్ర హోంశాఖను ఆదేశించింది. సుప్రీంకోర్టు తీర్పును న్యాయవాద సంఘాలు స్వాగతిస్తున్నాయి.
కోర్టు ఆవరణలో ఉగ్రవాదుల విధ్వంసకాండ, ప్రత్యర్ధుల హత్యాకాండ ఘటనలు తరచుగా చోటుచేసుకుంటున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ నెలల మధ్య మధ్యప్రదేశ్, కర్నాటక కోర్టుల వద్ద ఐదుగురు వ్యక్తులు ప్రత్యర్థుల చేతిలో హతమయ్యారు. ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. 2016లో దక్షిణ భారతదేశంలోకోర్టుల వద్ద విధ్వంసకాండ సృష్టించాలని ఆల్ ఉమా గ్రూపు పన్నాగం పన్నింది. నెల్లూరు, మైసూరు, కొల్లం, చిత్తూరు కోర్టుల ఆవరణలో బాంబు పేలుళ్లకు పాల్పడింది. 2011లో ఢిల్లీ హైకోర్టు ఆవరణలో బాంబు విస్ఫోటనం జరిగింది. కొన్ని సార్లు కోర్టుల్లో న్యాయమూర్తులు విచారణ చేసే సమయంలో కొన్ని శక్తులు వస్తువులను జడ్జిపైకి విసిరివేసే ఘటనలు కూడా జరుగుతున్నాయి. బీహార్ ప్రభుత్వం పాట్నా హైకోర్టుతోపాటు అన్ని కోర్టుల వద్ద నిఘాను పెంచింది. మెటల్ డిటెక్టర్లను ఏర్పాటుచేసింది. సిసిటివి కెమెరాలను కూడా నెలకొల్పారు. వివాహానికి సంబంధించి వివాదాల పరిష్కారానికి కోర్టుకు వచ్చే వారు కూడా కోర్టు ఆవరణల్లో ఘర్షణకు దిగుతున్న సందర్భాలు చాలా ఉన్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇక్కడ హైకోర్టు వద్ద కూడా భద్రతను పెంచారు. సిసిటివి కెమెరాలను, లగేజి స్కానర్లను కోర్టుల వద్ద ఏర్పాటు చేశారు. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌ను హైకోర్టు వద్ద భద్రత నిమిత్తం నియమించారు. 2005లో రంగారెడ్డి జిల్లా సబ్‌కోర్టు వద్ద ముగ్గురు వ్యక్తులు హతమయ్యారు. ఆంధ్రలో 2007లో కాకినాడ కోర్టు వద్ద రవాణా సంఘాల నేత ఒకరు హతమయ్యారు. 2016 ఏప్రిల్ 7వ తేదీన చిత్తూరు జిలల్లా కోర్టు ఆవరణలో బాంబు పేలుళ్ల ఘటన జరిగింది. ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి.