తెలంగాణ

పొగాకు వినియోగాన్ని మానుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 8: ప్రపంచ వ్యాప్తంగా విస్తృతంగా పొగాకు ఉత్పత్తుల వినియోగమే మానవ జాతి ఎదుర్కొంటున్న అతి పెద్ద జాడ్యమని డాక్టర్ అర్షీద్ హెచ్.హకీం అన్నారు. పొగాకు వినియోగం వల్ల ఏటా ఏడు మిలియన్ల మంది దీనికి బలి అవుతున్నారని తెలిపారు. ఆదివారం నాడిక్కడ పబ్లిక్ గార్డెన్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 264వ నెలవారీ ఆరోగ్య ఉపన్యాసంలో భాగంగా ‘పొగాకు క్యాన్సర్‌కు దారితీస్తుంది: క్యాన్సర్ ప్రారంభం కాకముందే దానిని ఆపండి’ అనే అంశంపై అపోలో క్యాన్సర్ హాస్పిటల్ ప్రముఖ సీనియర్ కన్సల్టెంట్, హెడ్ అండ్ నెక్ అంకాలజీ సర్జన్ డాక్టర్ హర్షీద్ హెచ్ హకీం ప్రసంగించారు. ప్రజలు పొగాకును వినియోగించడం మానివేస్తే క్యాన్సర్‌ను నిరోధించడం సాధ్యపడుతుందని అన్నారు. పొగాకు 4 వేలకు పైగా రసాయనాలను కలిగి ఉందని, దీనిలో 250కిపైగా దుష్ప్రభావాన్ని కలిగిస్తాయని అన్నారు. మరో 40 రసాయనాలు క్యాన్సర్‌కు దారితీస్తాయని అన్నారు. ఇదిలా ఉంటే ఆర్ధిక పరిస్థితుల ప్రభావం వల్ల పేద కుటుంబాలకు చెందిన పిల్లలు పొగాకును పండించే ప్రక్రియలో పాల్గొనడం వల్ల చర్మం ద్వారా నికోటిన్ చేరి క్రమేణా వారు ‘గ్రీన్ టొబాకో సిక్‌నెస్’కు గురౌతున్నారని అన్నారు. క్యాన్సర్‌కు దారితీసే ధూమపాన దుష్ప్రభావాలను ప్రతిబింభించే చిత్రాలను ప్రత్యేకించి వ్యతిరేకతపై కఠినమైన ప్రచారం ద్వారా పొగత్రాగే వారి సంఖ్యను గణనీయంగా తగ్గిస్తుందని, విడిచిపెట్టాలనుకునే వారి సంఖ్యను పెంచుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.