తెలంగాణ

సింగరేణి చీఫ్ మెడికల్ ఆఫీసర్‌పై వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 9: లంచం ఇవ్వనిదే కార్మికులకు ఫిట్‌మెంట్ సర్ట్ఫికేట్ జారీ చేయడం లేదని సింగరేణి కార్మికులు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయడంతో సింగరేణి ప్రధాన ఆస్పత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్‌పై బదిలీ వేటు పడింది. ఈ మేరకు చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కురిడి ప్రసన్న సింహను బదిలీ చేస్తూ సింగరేణి కాలరీస్ పర్సనల్ మేనేజర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేసారు. కొత్త చీఫ్ మెడికల్ ఆఫీసర్‌గా డాక్టర్ మమత శ్రీనివాస్‌ను నియమించినట్టు ఇదే ఉత్తర్వులలో పేర్కొన్నారు. సింగరేణి కార్మికులతో ప్రగతి భవన్‌లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో కార్మికులకు ఫిట్‌మెంట్ సర్ట్ఫికేట్ జారీ చేయడానికి చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆరు లక్షల రూపాయాలు లంచం తీసుకుంటున్నట్టు తన దృష్టికి వచ్చిందని ముఖ్యమంత్రి స్వయంగా వెల్లడించిన విషయం తెలిసిందే. లంచం ఇవ్వనిదే పని చేయని చీఫ్ మెడికల్ ఆఫీసర్‌పై చర్య తీసుకోనున్నట్టు ముఖ్యమంత్రి అదే సభలో ప్రకటించిన విషయం తెలిసిందే. చర్య తీసుకుంటామని ముఖ్యమంత్రి ప్రకటించిన 24 గంటలలోపుననే చీఫ్ మెడికల్ ఆఫీసర్‌పై బదిలీ వేటు పడింది. అలాగే ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు 2718 మంది కార్మికులను జనరల్ మజ్దూర్లుగా రెగ్యులరైజ్ చేస్తూ సింగరేణి సిఎండి శ్రీ్ధర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేసారు. రెగ్యులరైజ్ అయిన వారిలో రామగుండం-1 ఏరియాలో 699 మంది, రామగుండం-2 ఏరియాలో 446 మంది, మందమర్రి ఏరియాలో 426 మంది, భూపాలపల్లి ఏరియాలో 330 మంది, శ్రీరాంపూర్ ఏరియాలో 269 మంది, కొత్తగూడెం ఏరియాలో 266 మంది, రామగుండం-3 ఏరియాలో 243 మంది, మణుగూర్ ఏరియాలో 26 మంది, బెల్లంపల్లి ఏరియాలో 14 మంది కార్మికులు ఉన్నట్టు సిఎండి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. వీరితో పాటు 21 మంది సెక్యురిటీ గార్డులను జమేదార్లుగా పదోన్నతి కల్పించినట్టు పేర్కొన్నారు.