తెలంగాణ

తాగు, సాగుకు 122 టిఎంసిల నీళ్లివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 9: రాష్ట్రంలో తాగు, సాగునీటికి మొత్తం 122 టిఎంసిల నీరు ఇవ్వాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డును తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు ఇంజనీర్ ఇన్ చీఫ్ బి నాగేంద్ర రావు కృష్ణా బోర్డు మెంబర్ కార్యదర్శిని కోరుతూ లేఖ రాశారు. శ్రీశైలం నిండి, నాగార్జున సాగర్‌కు కూడా ఇన్‌ఫ్లో మొదలైనందున యాసంగి పంటకు సాగునీటకి ఢోకా ఉండదని, దాంతో నాగార్జున సాగర్ ఎడమ కాల్వ కింద యాసంగి పంటకు సాగు నీరు ఇచ్చేందుకు వీలుగా సర్కార్ ప్రణాళికలు రూపొందించింది. సాగర్ ఎడమ కాల్వ కింద జోన్ -1కు 34.50 టిఎంసిలు జోన్ -కు 20 టిఎంసిలు కావాలని నీటిపారుదల బోర్డు కోరింది. ఎలిమినేటి మాధవ రెడ్డి ప్రాజెక్టు ద్వారా చెరువులు నింపేందుకు 10 టిఎంసిలు ఇవ్వాలని కోరింది. వచ్చే ఏడాది జూలై వరకూ తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ మిషన్ భగీరధకు నిరంతరం సరఫరాకు ఇబ్బందులు లేకుండా కూడా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. హైదరాబాద్ తాగునీటి అవసరాలకు 13.78 టిఎంసిలు, మిషన్ భగీరథకు 14.83 టిఎంసిలు, నల్గొండ, ఫ్లోరైడ్ పీడిత గ్రామాలకు 3.89 టిఎంసిలు ఇవ్వాలని బోర్డుకు పంపిన లేఖలో అధికారులు పేర్కొన్నారు. మరోవైపు శ్రీశైలం ద్వారా కల్వకుర్తి మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకానికి 25 టిఎంసిలు కావాలని కోరింది.